S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 17:57

భువనగిరి: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు పాశం శ్రీనివాస్‌పై పలు కేసులు నమోదు కావడంతో వారంరోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం రేపు ఉదయం 10.30 గంటల నుంచి సెప్టెంబరు 3వ తేదీ ఉదయం 10.30 గంటల వరకు విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శ్రీను ప్రస్తుతం వరంగల్‌ జైల్లో ఉన్నాడు.

08/30/2016 - 17:30

ఆదిలాబాద్‌: నగల వ్యాపారి సంజయ్‌ అగర్వాల్‌ హత్య కేసులో ముగ్గురికి ఆదిలాబాద్‌ జిల్లా మొదటి అదనపు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 2012లో ఆదిలాబాద్‌లో సంజయ్‌ అగర్వాల్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం న్యాయస్థానం తుదితీర్పు వెలువరించింది.

08/30/2016 - 16:46

మోగదీషు: సోమాలియా దేశాధ్యక్షుడి నివాసానికి సమీపంలో మంగళవారం కారు బాంబు పేలింది. దుండగుడు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులువెల్లడించారు. అధ్యక్షుడు హసన్‌ షేక్‌ నివాసానికి ఎదురుగా ఉన్న రెండు హోటల్స్‌ దెబ్బతిన్నట్లు తెలిపారు. హోటల్‌ వద్ద అల్‌షబాబ్‌ గ్రూప్‌ మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించినట్లు పోలీసులు వెల్లడించారు.

08/30/2016 - 16:41

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.06 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 440 పాయింట్లు లాభపడి 52 వారాల గరిష్ఠానికి చేరింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 28,343 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 137 పాయింట్ల లాభంతో 8,744 వద్ద ముగిసింది.

08/30/2016 - 16:35

నేను ఎవరికీ బెదిరిపోయి ఉద్యమం ఆపను... సీఎం చంద్రబాబును నిద్ర పోనివ్వను... కాపు ఉద్యమం వెనుక జగన్ ఉన్నాడని కొందరు చెబుతున్నారు... జగన్ వయసు నా అనుభవమంత లేదు.. ఆయన నా వెనుకలేరు- అని మాజీ మంత్రి ముద్రగడ తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు నివాసంలో మంగళవారం కాపు సంఘం నేతల భేటీ ముగిసింది.

08/30/2016 - 16:05

విజయవాడ: నిడమానూరు - నెహ్రూ బస్‌స్టేషన్ మెట్రో రైల్‌ కారిడార్‌ను 2019 ఫిబ్రవరికి పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌తో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. నాలుగేళ్లలో మెట్రోను పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు.

08/30/2016 - 15:53

ఏలూరు : ఉండిలో రొయ్యలచెరువులో మంగళవారం ఇనుప పడవకు కరెంట్‌షాక్ తగిలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉండి వాసులు లింగయ్య, సురేష్‌గా గుర్తించారు. రొయ్యలచెరువు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

08/30/2016 - 15:51

ఢిల్లీ: ఎప్పుడూ వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ స్వామి ఈసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 'లెఫ్టినెంట్ గవర్నర్ వంటి ఉన్నత పదవికి జంగ్ పనికి రారని నా అభిప్రాయం. కేజ్రీవాల్ తరహాలోనే ఆయన కూడా ఓ 420. ఆయన స్థానంలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఉంది' అంటూ స్వామి మంగళవారం ట్వీట్ చేశారు.

08/30/2016 - 15:44

కరీంనగర్: మావోల పేరుతో బెదిరించి నగదు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.4 లక్షలు, 2 తుపాకులు, 1 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులున్న వారిని బెదిరించి నగదు వసూలు చేస్తుండగా పికాస మాజీ సీఓ దాసరి శ్రీకాంత్, పిల్లి సంపత్, భూమేష్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. వీరికి తుపాకులు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

08/30/2016 - 15:41

హైదరాబాద్‌ : నగరంలోని గన్ పార్క్‌ వద్ద మంగళవారం ఆందోళణకు దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్యను పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొడిగ శోభను అరెస్టు చేయాలని, కేసీఆర్‌ను విమర్శించినందుకు శోభా తన ఆస్తులపై దాడులు చేశారని రమ్య ఆరోపించారు. రమ్యతో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Pages