S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 12:11

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కెరమెరిలో రెండు రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ శ్రీ్ధర్ (27) అనుమానాస్పదంగా మరణించి ఉండడాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. పోలీస్ క్వార్టర్స్‌లోని ఇంట్లో శ్రీ్ధర్ మరణించి ఉండడాన్ని ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో పనిమనిషి గుర్తించి మిగతా సిబ్బందికి తెలియజేసింది. మృతదేహం పక్కన తుపాకీ పడిఉండడంతో పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. తుపాకీ పొరపాటున పేలిందా?

08/30/2016 - 12:09

ఝార్ఖండ్‌ : రామ్‌గఢ్‌ జిల్లాలో పోలీసులు, స్థానికులకు మధ్య మంగళవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు. గోలాలోని పవర్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్థులుఎదుట ఆందోళన చేపట్టారు. ఓ వర్గం గ్రామస్థులు ప్లాంట్‌ యాజమాన్యంతో చర్చలు జరుపుతుండగా, మరో వర్గం వారు అల్లర్లకు పాల్పడ్డారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు.

08/30/2016 - 07:27

గుంటూరు, ఆగస్టు 29: కష్టాల్లో ఉన్నవారికి కొండంత భరోసానిచ్చి ప్రజాసేవ, ఆప్యాయతలతో ప్రజల హృదయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్రవేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు.

08/30/2016 - 07:27

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 29: తెలుగుభాష నిర్ధిష్టత, సమగ్రత, హేతుబద్ధతకు కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు తొలి ఆధునికభాషా శాస్తవ్రేత్తగా అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అభివర్ణించారు. సోమవారం గిడుగు రామ్మూర్తి జయంతిసభ అవగాహనా సంస్థ కార్యాలయంలో జరిగింది.

08/30/2016 - 07:27

గుంటూరు, ఆగస్టు 29: కేంద్ర ప్రభుత్వం ఒబిసిలకు కల్పిస్తున్న 25 శాతం రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఆంక్షను పూర్తిగా ఎత్తివేయాలని బిసి సంక్షేమసంఘం రాష్ట్ర కన్వీనర్ కేసన శంకర్‌రావు డిమాండ్ చేశారు.

08/30/2016 - 07:26

విజయపూరి సౌత్, ఆగస్టు 29: ఎదురెదురుగా వస్తున్న కారు - ఆటో ఢీకొన్న సంఘటనలో 9 మందికి తీవ్రగాయాలపాలైన సంఘటన సోమవారం చాలపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మాచర్ల నుండి సాగర్ వైపు కారు వెళుతుండగా సాగర్ వైపు నుండి మాచర్ల వైపు ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. చాలపల్లి సమీపంలో ఎదురెదురుగా వచ్చి కారు - ఆటో ఢీకొనటంతో 9 మందికి గాయాలయ్యాయి.

08/30/2016 - 07:26

దాచేపల్లి, ఆగస్టు 29: గురజాల యమ్మేల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల యమ్మేల్యే పినె్నల్లి లక్ష్మారెడ్డిల సవాళ్ళు, ప్రతి సవాళ్ల మధ్య సోమవారం నడికుడి మార్కెట్ యార్డ్‌లో జరగవలసిన బహిరంగ చర్చా వేదికకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మరో పల్నాటి యుద్ధానికి తాత్కాలిక విరామం ఏర్పడింది.

08/30/2016 - 07:25

గుంటూరు, ఆగస్టు 29: జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాధులపై అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహించి వ్యాధి నిర్మూలన చర్యలు చేపట్టాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఎమ్మెల్యే మోదుగుల గుంటూరు ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు.

08/30/2016 - 07:25

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 29: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబిసి, మైనారిటీ, ఇతర పేద విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) డిమాండ్ చేసింది.

08/30/2016 - 07:25

సత్తెనపల్లి, ఆగస్టు 29: నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు చెరువుల్లోకి వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంది. రెంటపాళ్ళ, గోగులపాడు మధ్యగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఎద్దువాగును స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం పరిశీలించారు. ఆయా గ్రామల్లో చెరువులు నిండుతుండడంతో రైతులు హర్హం వ్యక్తంచేస్తున్నారు.

Pages