S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 17:54

ఢిల్లీ: ఏపీ, తెలంగాణ సీఎస్‌ల పదవీకాలాన్ని మరో 3 నెలల పొడిగింపునకు ప్రధాని అంగీకారం తెలిపినట్లు అధికారులుసోమవారం తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

08/29/2016 - 17:24

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం సోమవారం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

08/29/2016 - 17:21

విజయవాడ: చిత్తూరు, అనంతపురం జిల్లాలలో కరవు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. అనంతపురం జిల్లాకు మురళీధర్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు వినయ్‌చంద్‌ను నియమించారు.

08/29/2016 - 17:19

దిల్లీ: భారత్‌ సందర్శనకు వచ్చే విదేశీ మహిళలు స్కర్టులు ధరించి రాకూడదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీనిపై పలువురు విమర్శలు, ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తుండడంతో మంత్రి వివరణ ఇచ్చారు. కేవలం మత సంబంధ ప్రదేశాల గురించి మాత్రమే మాట్లాడానని, మహిళలు ఏం ధరించాలో.. ఏం ధరించవద్దో తాను కామెంట్‌ చేయలేదని సోమవారం మహేశ్‌ శర్మ వివరణ ఇచ్చారు.

08/29/2016 - 17:13

దిల్లీ: బులంద్‌షహర్‌లో తల్లీకూతుళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆజంఖాన్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అధికారంలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

08/29/2016 - 17:09

ఆదిలాబాద్‌: లోకేశ్వరం మండలం పంచగుడిలో విద్యుదాఘాతంతో సోమవారం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ధర్మోరకు చెందిన భూమన్న, మోహాల వాసి నవీన్‌గా గుర్తించారు. బోరుబావిలో పైపులు దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

08/29/2016 - 16:33

ముంబయి: సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.16 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 120 పాయింట్ల లాభంతో 27,902 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 8,607 వద్ద ముగిసింది.

08/29/2016 - 16:31

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ పేరును ఇంగ్లీష్‌లో బెంగాల్‌గా, బెంగాళీలో బంగ్లాగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. పశ్చిమ (West) అనే పదం తొలగింపుతో ప్రస్తుతం ఇంగ్లీష్‌లో 31వ వరుస క్రమంలో ఉన్న రాష్ట్రం టాప్‌లోకి చేరుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి కేంద్రం అంగీకారం తెలపాల్సి ఉంది.

08/29/2016 - 16:27

హైదరాబాద్: సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మెకు ఏపీ ఎన్జీవో జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు సోమవారం ప్రకటించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సెప్టెంబర్‌ 28, 29తేదీల్లో మండల స్థాయిలో ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం నిధులు రావాలన్నారు. ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామన్నారు.

08/29/2016 - 16:24

విశాఖ : ఉత్తరకోస్తాను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం చెప్పారు. కోస్తాలో పలుచోట్ల, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ కోస్తాలో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడ్డాయని చెప్పారు.

Pages