S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 13:53

కాకినాడ: అనపర్తిలోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచిలో నకలీ ధ్రువపత్రాలతో సుమారు 44 లక్షల రూపాయల మేరకు రుణం పొందిన పొలగం రామారెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తమకు రామారెడ్డి ఇచ్చినవి నకలీ పత్రాలని తేలడంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

08/29/2016 - 13:52

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్టత్రో తెలంగాణ సర్కారు చేసుకున్న ఒప్పందాలకు నిరసనగా టి.టిడిపి నేతలు సోమవారం తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి జలసౌధ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని సంకల్పించారు. అయితే, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి ర్యాలీ బయలుదేరకుండా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

08/29/2016 - 13:52

గుంటూరు: ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా విపక్షనేత వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం ఉదయం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో విద్యాశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించేలా అన్ని పార్టీల వారూ కలిసి రావాలని ఆయన అన్నారు.

08/29/2016 - 13:41

రాజమండ్రి: మంత్రి నారాయణ ఎన్నికల అఫిడవిట్‌లో చూపించిన రూ. 477 కోట్ల ఆదాయాన్ని ఎలా సంపాదించారో స్పష్టం చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి డిమాండ్ చేశారు. మంత్రి స్పందించకపోతే ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్తానని ఉండవల్లి హెచ్చరించారు.

08/29/2016 - 13:34

ఢిల్లీ: పోలవరం పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఒడిశా వాసి వేసిన పిటిషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) లో విచారణ వాయిదా పడింది. సెప్టెంబర్ 5న పూర్తి సమాచారంతోనైనా లేదా సంబంధిత అధికారితో రావాలని కేంద్రానికి ఎన్‌జీటీ ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

08/29/2016 - 13:19

దిల్లీ: ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు, కాంస్య పతకం సాధించిన సాక్షి మలిక్‌, అద్భుత ప్రదర్శన చేసిన దీపా కర్మాకర్‌, జీతూరాయ్‌లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేశారు. సత్తి గీత, సిల్వానస్‌ డంగ్‌ డంగ్‌, రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కేలు ధ్యాన్‌చంద్‌ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.

08/29/2016 - 12:33

కర్నూలు: తుంగభద్ర నదిలో తెప్ప బోల్తా పడి, ఒకరు గల్లంతవ్వగా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. పొన్నూరు నుంచి కొందరు భక్తులు కందుకూరు ఉరుకుంద వీరాంజనేయస్వామి దర్శనం కోసం తెప్పలో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

08/29/2016 - 12:26

హైదరాబాద్‌: మహారాష్ట్రతో ఒప్పదం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడుతోందని, ఆ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ చేపట్టిన తెలంగాణ తెదేపా నేతలు ఎల్‌.రమణ, రేవంత్‌రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి ర్యాలీగా జలసౌధకు చేరుకుని ధర్నా చేపట్టిన నేతలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

08/29/2016 - 12:22

నల్గొండ : చౌటుప్పల్‌ మండలంలోని అల్లాపురం మార్గంలో ఆరు మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మట్టికొట్టుకుపోయి మందు పాతరలు కనిపించడంతో రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో మరిన్ని మందుపాతరలు ఉండొచ్చని అనుమానించిన పోలీసులు రహదారికి ఇరువైపులా తనిఖీలు చేస్తున్నారు.

08/29/2016 - 12:17

హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అసెంబ్లీలో నిలదీస్తామని టీ.టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డ వద్దకు మార్చడం వల్ల రూ. 50వేల కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ వల్ల ప్రజలపై లక్ష కోట్ల అదనపు భారం పడుతుందని, ప్రాజెక్టుల రీడిజైన్‌పై అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Pages