S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 16:22

కాకినాడ : మాజీ ప్రధాని దేవెగౌడ సోమవారం కుటుంబసభ్యులతో అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఈ సంద్బంగా దేవెగౌడ మాట్లాడుతూ, దేశంలో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోందని, కాశ్మీర్‌ సమస్య గతంలో కంటే క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు.

08/29/2016 - 15:54

ఒంగోలు : ఒంగోలులో సోమవారం స్వల్పంగా భూమి కంపించింది. తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు రోడ్డుపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

08/29/2016 - 15:46

హైదరాబాద్: నెలరోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తిచేయకపోతే ఉద్యమం తప్పదని తెలంగాణ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాసగౌడ్‌ చెప్పారు. ఏపీ సీఎస్‌తో ఆయన సమావేశమయ్యారు. కమల్‌నాథన్‌ కమిటీ గడువు పెంచాలని కేంద్రానికి ఏపీ మళ్లీ లేఖరాయడం దారుణమన్నారు. ఏపీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తున్నారని , కమల్‌నాథన్‌ కమిటీ కాలయాపన చేస్తోందని, ఏవో సాకులు చూపి ఉద్యోగుల విభజన ఆలస్యం చేస్తోందని ఆయన అన్నారు.

08/29/2016 - 15:30

శ్రీనగర్‌ : 51 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూ సోమవారం ఎత్తివేయడంతో కాశ్మీర్‌ లోయలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు షాపుల వద్ద బారులు తీరారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు కాల్చివేశారు. శ్రీనగర్‌, పుల్వామా జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

08/29/2016 - 15:27

విశాఖ : విశాఖ ఐఎన్‌ఎస్‌ డేగాలో సోమవారం మిగ్ 29కే (నేవీ యుద్ధవిమానానికి) టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ఇంధన ట్యాంక్ పడిపోవడంతో మిగ్‌ 29కేలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని నేవీ ప్రకటించింది.

08/29/2016 - 15:21

బ్రసెల్స్‌ : బాంబు పేలుడుతో బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ సోమవారం మరోసారి ఉలిక్కిపడింది. జాతీయ క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్‌ ప్రాంగణంలోకి వేగంగా ఒక కారు దూసుకువెళ్లి, తర్వాత పేలిపోయింది.. ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఇటీవలె బ్రస్సెల్స్‌ విమానాశ్రయం, మెట్రో స్టేషన్‌లో భారీ పేలుళ్లు సంభవించడంతో 32 మంది మరణించారు.

08/29/2016 - 15:18

ఆడెన్: యెమెన్‌‌లోని ఆడెన్ ప్రాంతంలో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు సోమవారం ఆత్మాహుతి దాడికి దిగారు. ఈ దాడిలో 45 మంది పౌరులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో కాంపౌండ్‌ను ఢీకొట్టి ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.

08/29/2016 - 15:13

ఢిల్లీ: తెలంగాణలో కొత్త వీసీల కొనసాగింపునకు సుప్రీంకోర్డు సోమవారం అంగీకారం తెలిపింది. ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులకు చీఫ్‌ జస్టిస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

08/29/2016 - 13:54

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా సాధించేవరకూ రాజీలేని పోరాటం చేస్తామని, దిల్లీలో నిరసనలు చేస్తేనే కేంద్రం గుర్తిస్తుందని విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని సోమవారం విలేఖరులతో అన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే ప్రజలకే నష్టం కలుగుతుందని, అన్ని పరిస్థితులనూ పరిశీలిస్తూ సిఎం చంద్రబాబు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారన్నారు.

08/29/2016 - 13:53

కాకినాడ: బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం ఉదయం రావులపాలెంలో వెలుగుచూసింది. ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో దుండగులు ప్రవేశించి, ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హతమార్చారు. ఆమె నుంచి 20 కాసుల బంగారాన్ని దోచుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

Pages