S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 12:10

విజయవాడ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం పిలిచిన స్విస్‌ఛాలెంజ్ బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 16వరకు పొడిగించింది. సాంకేతిక బిడ్ దాఖలుకు సెప్టెంబర్ 13వరకు గడువు విధించింది. బిడ్ అర్హత సాధించిన వారి జాబితాను 16న ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

08/29/2016 - 12:08

కర్నూలు: కుంభకర్ణుడిలా పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకోసారి నిద్రలేచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మండిపడ్డారు. రాజకీయాలు అంటే గడ్డం గీసుకున్నంత ఈజీ కాదని, అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీజీ హితవు పలికారు. త్వరలో చిరంజీవి రాజ్యసభ పదవికాలం ముగుస్తుందని, రాజీనామాలు అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబడ్డారు.

08/29/2016 - 11:32

హైదరాబాద్‌: నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి నలుగురు గాయపడ్డారు. నగరంలోని మదాపూర్‌‌ కాకతీయ హిల్స్‌లో ఐదు అంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. ఓ పిల్లర్ కుంగి భవనం కూలింది. కూలీలను బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.

08/29/2016 - 11:29

కర్నూలు: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ

08/29/2016 - 11:23

తిరుమల: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్న కృష్ణమూర్తికి తితిదే అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కేఈ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలు పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

08/29/2016 - 11:18

లాస్‌ఏంజిల్స్‌: లాస్‌ఏంజిల్స్‌ (అమెరికా) ఎయిర్‌పోర్టులో సోమవారం తుపాకీ పేలిన శబ్ధం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. భద్రతా బలగాలు విమానాశ్రయాన్ని చుట్టుముట్టాయి. ఎలాంటి కాల్పులు జరగలేదని నిర్ధారించడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణికులు పరుగులు తీయడంతోనే గందరగోళం ఏర్పడించిన పోలీసులు వెల్లడించారు.

08/29/2016 - 11:15

బీజింగ్‌: చైనాలోని గువాంగ్జీ జువాంగ్‌లో నానింగ్‌ ప్రాంతానికి వెళ్తున్న బస్సు ఆదివారం అర్ధరాత్రి బారికేడ్లను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా 10 మంది మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

08/29/2016 - 11:13

ఒంగోలు : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి లో పెద్దపులి సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పులి కాలిముద్రలు చూసిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పెద్దపులి కాలిముద్రలు పరిశీలిస్తున్నారు.

08/29/2016 - 11:10

కర్నూలు: సోమవారం ఉదయం కర్నూలు వెంకన్న బావి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంబులెన్స్‌ అంబులెన్స్‌ టైరు పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు అవతలి వైపు ఉన్న లారీని లారీని ఢీకొంది. అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

08/29/2016 - 07:14

నాతవరం, ఆగస్టు 28: రాష్ట్రంలో మూడువేల కోట్లతో ఐదువేల కిలో మీటర్ల సిమ్మెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం మండలంలోని మన్యపురట్ల, గునిపూడి,తాండవ జంక్షన్, యర్రవరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.

Pages