S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 03:33

హైదరాబాద్, ఆగస్టు 6: నల్సార్ విశ్వవిద్యాలయ 14వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి శనివారం సతీసమేతంగా బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కెసిఆర్‌ను కలిశారు.

08/07/2016 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 6: ఇసుక మైనింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానం బాగుందని చత్తీస్‌గఢ్ మైనింగ్ శాఖ ఎండి అధికారిణి రీనా, మహారాష్ట్ర మైనింగ్ శాఖ ఎండి నిరుపమా డాంగే ప్రశంసించారు. తెలంగాణ ఇసుక పాలసీని పరిశీలించేందుకు వచ్చిన వీరు శనివారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి.ఇలంబరితో సమావేశమయ్యారు.

08/07/2016 - 03:28

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలను శనివారం రాష్టమ్రంతటా ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ భవన్‌లో జయశంకర్‌కు నివాళులర్పించారు. జయశంకర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు ఆయన విగ్రహాలకు, చిత్ర పటాలకు నివాళులర్పించారు.

08/07/2016 - 03:21

హైదరాబాద్, ఆగస్టు 6: సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు మహామహోపాధ్యాయ కొల్లేగాళ్ సుబ్రహ్మణ్యం(87) శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లోని బర్కత్‌పుర ఆంధ్ర యువతి మండలి దగ్గర లక్ష్మీబాలకృష్ణ నివాస్ అపార్ట్‌మెంట్‌లో(్ఫన్ నెంబర్: 8978355877) ఆయన భౌతికకాయాన్ని ఉంచారు.

08/07/2016 - 03:19

హైదరాబాద్, ఆగస్టు 6: దేశంలో కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఆదివారం అడుగు పెడుతున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, బిజెపి సభలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నాం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

08/07/2016 - 03:14

కాకినాడ, ఆగస్టు 6: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి జీతాల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానే్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలుచేయాలని ఉపాధి హామీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేతనాల్లో వ్యత్యాసం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వారు కోరుతున్నారు.

08/07/2016 - 03:14

తిరుమల, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోందని టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. హోదా విషయాన్ని అభ్యర్థించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో ఆయన ‘‘ మీ సమస్య నా సమస్య’’ అని హామీ ఇచ్చారని, ఆయన తప్పకుండా రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటారని తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు.

08/07/2016 - 03:13

విజయవాడ, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆప్షన్ల నమోదు ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిసారిగా విద్యార్థులు నెట్ సెంటర్లు, హెల్ఫ్‌లైన్ సెంటర్ల నుంచి ఆప్షన్లను ఎంచుకోటం ప్రారంభించారు. 6,7 తేదీల్లో 1 నుంచి 5వేల ర్యాంక్ వరకు, 7,8 తేదీల్లో 5001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంది.

08/07/2016 - 03:12

కావలి, ఆగస్టు 6: ప్రాణాంతకమైన అణువిద్యుత్ కేంద్రాలను అంతర్జాతీయంగా ఒక్కొక్క దేశం నిలుపుదల చేసుకొంటూ వస్తుంటే మన దేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో నెలకొల్పాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ ప్రయత్నాలను ప్రజలతో కలిసి అడ్డుకుంటామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

08/07/2016 - 03:07

హైదరాబాద్, ఆగస్టు 6: ఎన్నో న్యాయ వివాదాల్లో చిక్కుకున్న 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 13 నుంచి 23 వరకూ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్ణయించింది. శనివారం 2011 గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపిపిఎస్సీ ఇప్పటికే మెయిన్స్ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది.

Pages