S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 03:08

నూజివీడు, జూలై 17: నూజివీడు పట్టణానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది. అయినప్పటకీ ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా చీకట్లోనే ఉంది. దీనిని అందరం కలసి సమష్టిగా అభివృద్ధి చేద్దామని సబ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.

07/18/2016 - 03:07

మచిలీపట్నం, జూలై 17: కాపు సామాజిక వర్గానికి చెందిన పేదలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కాపు కార్పొరేషన్ ద్వారా రూ.25లక్షల మేర గ్రూప్ రుణాలు మంజూరు చేయనున్నారు. జిల్లాలో 100 గ్రూపులను ఏర్పాటు చేసి రూ.25 కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు కాపు కార్పొరేషన్ అధికారులు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు.

07/18/2016 - 03:06

మచిలీపట్నం, జూలై 17: నిరంతరం ప్రజలతోనే ఉంటానని, వారు ఎదుర్కొనే సమస్యలను నా సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని, ఇందు కోసం తాను సైకిల్ యాత్ర చేపట్టినట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర వారం వారం నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ఆదివారం స్థానిక 15వ వార్డులో కొనసాగింది.

07/18/2016 - 03:06

మైలవరం, జూలై 17: గత ఎన్నికల సమయంలో అధికారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ పచ్చి మోసాలేనని గడప గడపకు వెళ్ళి ప్రజలకు తెలియ చేద్దామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

07/18/2016 - 03:05

పెనుగంచిప్రోలు, జూలై 17: కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన భక్తులు గ్రామానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

07/18/2016 - 03:04

మచిలీపట్నం (కల్చరల్), జూలై 17: క్విజ్ పోటీలు విద్యార్థుల జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తులను పెంపొందిస్తాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు అన్నారు. స్థానిక రాజుపేట లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఆదివారం భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇన్‌టాక్) మచిలీపట్నం ఛాప్టర్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు.

07/18/2016 - 03:04

గుడ్లవల్లేరు, జూలై 17: మండల కేంద్రం వేమవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారిని ఆషాడమాసం సందర్భంగా ఆదివారం పలు రకాల కూరగాయలు, పండ్లతో శాకాంబరిదేవిగా అలంకరించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/18/2016 - 03:03

ఇంద్రకీలాద్రి, జూలై 17: వివిధ రకాలైన శాకములనే సర్వాభరణాలుగా ధరించి సర్వాగ సుందరంగా ఆభయ, వరద హస్తంతో చిరుమందహాసంతో శోభిల్లుతూ పద్మంలో ఆశీనురాలైన శాకంబరీదేవిని దర్శించుకోవటానికి భక్తులు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కొంగుబంగారంగా, జీవుడికి ఆకలి, దప్పిక తీర్చే సకల సంపదలను అందించాలని భక్తులు ఆదివారం శాకంబరీదేవి దివ్య అలంకారంతో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటానికి తరలి వచ్చారు.

07/18/2016 - 03:03

విజయవాడ, జూలై 17: కాపులను బిసిల జాబితాలో చేర్చేందుకు నియమించిన బిసి కమిషన్ తన నివేదికను ఆగస్టు మాసాంతంలోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సి వుందని ‘డెడ్‌లైన్’ ముంచుకొస్తోందంటూ కాపు సంఘాల నేతలు హెచ్చరికలపై హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు బిసి సంఘాల నేతలు కాపుల్ని బిసిలుగా గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టవద్దంటూ బిసి కమిషన్‌కు కుప్పలుతెప్పలుగా వినతిపత్రాలు అందిస్తున్నారు.

07/18/2016 - 03:02

ఇంద్రకీలాద్రి, జూలై 17: కొన్ని కారణాల వలన రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు మాత్రం సోదరులేనని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్పష్టం చేశారు. శాకంబరీదేవి మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం తెలంగాణ నుండి ప్రత్యేకంగా వచ్చిన బోనాలకు మంత్రి పాతబస్తీ ఇంద్రకీలాద్రి మంత్రి షేషీ కార్యాలయం ప్రాంగణంలో ఘనస్వాగతం పలికారు.

Pages