S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 07:20

హైదరాబాద్, జూలై 4: న్యాయాధికారుల ఆందోళన విరమింపజేసేందుకు గవర్నర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. న్యాయమైన తమ డిమాండ్లు ఆమోదించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని న్యాయవాదులు తేల్చి చెప్పారు. ఆందోళన విరమించాలని, న్యాయమైన కోర్కెలకు పరిష్కారం లభిస్తుందని గవర్నర్ నరసింహాన్ న్యాయవాదులకు సూచించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలో న్యాయాధికారులు ఆందోళనకు దిగారు.

07/05/2016 - 07:11

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన విరమించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర వైద్య మంత్రి సి. లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం జరిపిన చర్చలు ఫలించాయి.

07/05/2016 - 07:09

హైదరాబాద్, జూలై 4: కొత్తరాష్ట్రం అయినా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకుంటున్నారని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో సోమవారం ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రం సాధించిన పారిశ్రామిక ప్రగతిని కెటిఆర్ వివరించారు.

07/05/2016 - 07:06

హైదరాబాద్, జూలై 4: హరితహారం క్రతువును 8న సిఎం కెసిఆర్ నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. అదేరోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సిఎం మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభిస్తారని సిఎంవో వెల్లడించింది.

07/05/2016 - 07:04

న్యూఢిల్లీ, జూలై 4: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్‌ను సోమవారం సీబిఐ అరెస్టు చేసింది. రూ.50 కోట్ల అవినీతి కేసులో రాజేంద్రకుమార్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ‘అరెస్టయిన వారిపై అవినీతి, అధికార దుర్వినియోగం అభియోగాలు ఉన్నాయి. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని గౌడ వివరించారు.

07/05/2016 - 06:56

న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాని నరేంద్ర మోదీ జట్టులో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూరె్తైంది. రాష్టప్రతి భవన్‌లో నేడు 11 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో నరేంద్ర మోదీ ఏడు నుంచి తొమ్మిది మంది కొత్త వారిని కేబినెట్‌లో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గం విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు పెద్దపీట వేస్తున్నట్టు సమాచారం.

07/05/2016 - 06:51

రియాద్, జూలై 4: సౌదీ అరేబియా పట్టణాలైన మదీనా, ఖాటిఫ్, జెద్దాలు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి. రంజాన్ ఉపవాస నెల చివరి రోజున ఈ దాడులు జరగటం తీవ్రస్థాయిలో ఆందోళనకు దారితీసింది. ఈ సంఘటనల్లో పలువురు మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో ఆయా మసీదుల వద్ద హాహాకారాలు మిన్నంటాయి.

07/05/2016 - 06:49

విజయవాడ, జూలై 4: విజయవాడలో రోడ్ల విస్తరణ పనుల పేరుతో అనేక ఆలయాలను తొలగించడం పట్ల హిందూ మత సంస్థలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుడుల కూల్చివేతను ఖండిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ సహా వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు సోమవారం సమావేశమై చర్చించారు. వీరిలో ఒక బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

07/05/2016 - 06:47

విశాఖపట్నం, జూలై 4: ఇంధన పొదుపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని బ్రిక్స్ దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విశాఖ హోటల్ తాజ్ గేట్‌వేలో సోమవారం అంతర్జాతీయ ఇంధన సదస్సు ప్రారంభమైంది. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సదస్సుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

07/05/2016 - 06:09

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలోని రైతులకు 4500కోట్లమేర లబ్ధి చేకూర్చేలా కేంద్రం వివిధ రకాల ఎరువుల ధరల్ని తగ్గించింది. గత పదిహేనేళ్లలో తొలిసారిగా నాన్ యూరియా ఎరువుల రేట్ల నూ తగ్గించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్‌కుమార్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. డిఎపి సహా నాన్ యూరియా ఎరువుల రిటైల్ ధరల్ని టన్నుకు 5వేల రూపాయల చొప్పున తగ్గించామన్నారు.

Pages