S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 06:06

గుంటూరు, జూలై 4: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుండే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయ ప్రాంగణంలోని ఐదో బ్లాకులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లలో జరుగుతున్న అంతర్గత అలంకరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

07/05/2016 - 06:03

విజయవాడ, జూలై 4: పుష్కరాలను పురస్కరించుకుని రోడ్ల విస్తరణ కోసం తొలగించిన ఆలయాలను శాస్త్రోక్తంగా తిరిగి నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో దేవాలయాల తొలగింపుపై ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో సిఎం సోమవారం స్వయంగా నగరంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు.

07/05/2016 - 06:03

హైదరాబాద్, జూలై 4: అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్ధతి పాటించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే సింగపూర్ ప్రభుత్వం అధీనంలోని సింగపూర్ కన్సార్టియం సీడ్ క్యాపిటల్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. సింగ్‌బ్రిడ్జి, సెంబ్ కార్ప్, అసెండాస్ కంపెనీలతోకూడిన కన్సార్టియంకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

07/05/2016 - 05:50

హైదరాబాద్, జూలై 4: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం వేములగట్టులో మంగళవారం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజాక్) అధ్యర్యంలో ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు-ప్రతిపాదన-చర్చ’ అనే అంశంపై ఈ సదస్సునస ఏర్పాటు చేసింది.

07/05/2016 - 05:49

తొగుట, జూలై 4: బంగారు తెలంగాణలో మల్లన్నసాగర్ భూనిర్వాసితులను భాగస్వామ్యం చేయకుండా అభివృద్ధి పేరుతో గ్రామాలను ధ్వంసం చేయడం సరికాదని, ప్రజలను ఆగమాగం చేసి పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం ఎందుకని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు.

07/05/2016 - 05:48

రామాయంపేట, జూలై 4: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మెన్ రాజమణి మురళీయాదవ్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం అభివృద్ధిని ఆటంకపరచడమే అన్నారు.

07/05/2016 - 05:48

హైదరాబాద్, జూలై 4: నార్త్‌జోన్ పరిధిలోని బొల్లారంలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అనిల్‌కుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాసిగూడకు చెందిన మైనర్ బాలిక సరితను అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు.

07/05/2016 - 05:47

కోరుట్ల, జూలై 4: కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం గ్రామ పరిసరాల్లో ఆదివారం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఎల్లపల్లి వౌనిక (19) అనే వివాహిత హత్య కేసులో అమె తండ్రి భూమల్ల నడిపి మల్లయ్య హంతకుడని కోరుట్ల సిఐ రాజశేఖర్‌రాజు వెల్లడించారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హంతకుడు, హత్యకు గల కారణాలను ఆయన వెల్లడించారు.

07/05/2016 - 05:47

దండేపల్లి, జూలై 4: రోజూ ఉల్లాసంగా ఆడుకునే ఉయ్యాలే ఆ చిన్నారి మెడకు ఉరితాడైంది. హృదయ విదారకరకమైన ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దండేపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు గోళ్ళ మంజుల కుమారుడు రిషీత్ (10) ఉయ్యాలపై అడుతూ ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకోవడంతో ఉయ్యాలపైనే మరణించాడు.

07/05/2016 - 05:46

హైదరాబాద్,జూలై 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మేనేజిమెంట్ స్టడీస్ ప్రొఫెసర్ వి.వెంకటరమణకు రాష్టప్రతి భవన్ నుండి పిలుపు వచ్చింది. రాష్టప్రతి భవన్‌ను స్మార్టు మోడల్ టౌన్‌షిప్ - ప్రెసిడెంట్ ఎస్టేట్‌గా మార్చేందుకు అవసరమైన చర్యలను సమీక్షించాలని వెంకటరమణకు ఆహ్వానం అందింది. దీనికంటే ముందు హర్యానాలోని ఐదు గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రణాళికను రూపొందించిన బృందంలో రమణ కూడా ఉన్నారు.

Pages