S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 05:46

నల్లగొండ, జూలై 4: కరకు శిల్పాలకు ఉలితో ప్రాణం పోసి దేవుళ్లుగా తీర్చిదిద్దే నీలగిరి (నల్లగొండ) జక్కన్నకు తాను నమ్ముకున్న శిల్పకళ బతుకు భరోసా ఇవ్వలేకపోతోంది. అరుదైన శిల్పకళను తనకు దాసోహం చేసుకున్న యువకుడు చౌడోజు నరసింహచారి (21) నైపుణ్యం మబ్బుచాటు చంద్రుడిలా మసులుతోంది.

07/05/2016 - 05:45

ఆదిలాబాద్, జూలై 4: బాహ్య ప్రపంచానికి దూరంగా దట్టమైన కీకారణ్యంలో జీవించే ఆదిమ గిరిజనులు సోమవారం తొలిసారి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని తమ సమస్యలు ఏకరవు పెడుతూనే అధికారులతో ఆడుతూ పాడుతూ ఆనందడోలికల్లో మునిగితేలారు. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌జిత్ దుగ్గల్ జిల్లాలోని తిర్యాణి మండలం గుండాల గ్రామానికి కాలినడకన వెళ్ళి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

07/05/2016 - 05:38

విజయవాడ, జూలై 4: బయోటెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను త్వరలో లీడర్‌లా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. బయో టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచానికి గమ్యస్థానం చేసే ప్రయత్నాలకు సోమవారం బీజం పడింది. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్, గోదావరి నాలెడ్జ్ సొసైటీ, లేపాక్షి బయోటెక్ పార్క్‌తో కలిసి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన త్వరలో అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది.

07/05/2016 - 05:37

రాజమహేంద్రవరం, జూలై 4: ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఒక్క గోదావరి నదికి మాత్రమే ప్రత్యేకం..దేశంలో ఏ నదికీ ఆది, అంత్య పుష్కరాలు లేవు. గురుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో ఏడాది పొడవునా గోదావరి పుష్కరాలు, గురుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో కృష్ణా పుష్కరాలు జరుగుతాయి. అయితే అంత్య పుష్కరాలు మాత్రం గోదావరి నదికి మాత్రమే ఉండటంతో జూలై 31 నుంచి గోదావరి నదికి అంత్య పుష్కరాలు ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నాయి.

07/05/2016 - 05:36

తిరుమల, జూలై 4: పోలీస్ శాఖలో త్వరలో 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు ప్రకటించారు. సోమవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయం వెలుపల విలేఖర్లతో మాట్లాడుతూ విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,800 మంది పోలీసులు రానున్నారన్నారు. ఈమేరకు అన్ని చర్యలూ పూర్తయ్యాయన్నారు.

07/05/2016 - 05:36

విశాఖపట్నం, జూలై 4: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన ఎం సాయి శ్రీనివాస్ విడుదలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ భార్య లలిత, పిల్లలను సోమవారం మంత్రి పల్లె పరామర్శించారు.

07/05/2016 - 05:35

విజయనగరం(టౌన్), జూలై 4: జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేను నిర్వాసిత గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. సోమవారం ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామం జమ్మయ్యపేటలో సర్వే నిర్వహించేందుకు భోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డి సిబ్బందితో వచ్చారు.

07/05/2016 - 05:35

కర్నూలు, జూలై 4: రాష్ట్రంలో అధికార పక్షం ప్రజల వివరాలు సేకరించడానికి ఇంటింటి సర్వే పేరుతో అధికారులను జనంలోకి పంపుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని అదే ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైకాపా నేతలు గడప గడపకూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కరోజు తేడాతో ప్రభుత్వ, ప్రతిపక్ష కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

07/05/2016 - 05:29

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సదాభార్గవిని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) శాఖకు సంబంధించిన విజిలెన్స్, క్రమశిక్షణ అంశాలపై ఆమె విచారణ చేస్తారు. విజిలెన్స్ కమిషనర్ సూచనల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ వివరించారు.
భవన నిర్మాణ వర్కర్లకు చేయూత

07/05/2016 - 05:28

న్యూఢిల్లీ, జూలై 4: భర్తీ ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ అన్ని ఉద్యోగాల్లోనూ దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Pages