S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 08:30

రాజమహేంద్రవరం, జూలై 1: తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజిపై దొంగలు పడ్డారు. బ్యారేజీ నిర్వహణలో కీలకమైన బ్రేక్ కాయల్స్ మాయమయ్యాయి. ఒక్కొక్కటి సుమారు రూ.10 వేలు విలువచేసే మొత్తం 140 కాయల్స్ మాయమయ్యాయి. గేట్ల ఎత్తివేతలో ఈ బ్రేక్ కాయల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

07/02/2016 - 08:29

విజయవాడ, జూలై 1: రాష్ట్రాన్ని సంపూర్ణ కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు వేయిస్తే నీరుపడక, వర్షాలు కురవక, పంట పొలాలు ఎండిపోయి పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూగర్భ జలాల గురించి గతంలో ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

07/02/2016 - 08:20

న్యూఢిల్లీ, జూలై 1: ప్రాంతీయ విమాన అనుసంధాన పథకాన్ని (ఆర్‌సిఎస్) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించింది. కొత్త పౌరవిమానయాన విధానంలో భాగంగా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు అందాలనే ప్రభుత్వ యోచనకు అనుగుణంగా ఆర్‌సిఎస్‌ను తీసుకొచ్చారు. విమానయాన సంస్థలు, విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతోసహా భాగస్వాములందరి అభిప్రాయాలను దీనిపై కేంద్రం సేకరిస్తోంది.

07/02/2016 - 08:17

ముంబయి, జూలై 1: జోన్ స్టార్టప్స్ ఇండియా, కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నెక్స్ట్ బిగ్ ఐడియా’ పోటీకి ఈ ఏడాదికిగాను గూగుల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ అధిక టెక్నాలజీ, అమిత సామర్థ్యం కలిగిన ఐదు అంకుర సంస్థల (స్టార్టప్)ను ఎంపిక చేయడానికి నిర్దేశించినది.

07/02/2016 - 08:17

తడ, జూలై 1: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొన్న శ్రీసిటి పారిశ్రామిక వాడను శుక్రవారం చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం సందర్శించింది. చైనాలోని షెజియాంగ్ రాష్ట్రం నుండి విచ్చేసిన పది మంది సభ్యుల బృందానికి శ్రీసిటి వ్యవస్థాపకుడు రవీంద్ర సన్నారెడ్డి ఘనంగా స్వాగతం పలికి పారిశ్రామికంగా శ్రీసిటి సాధించిన ప్రగతిని గురించి వివరించారు.

07/02/2016 - 08:16

ముంబయ, జూలై 1: పక్కన ఫోటోలో కనిపిస్తున్నది పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయ, బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా ఎగవేసి విదేశాలకు పారిపోయన కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం. బకాయల వసూళ్లలో భాగంగా దీన్ని సర్వీస్ ట్యాక్స్ శాఖ వేలం వేయగా, కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలైంది. అదికూడా విమానం విలువ 152 కోట్ల రూపాయలుగా నిర్ణయంచి వేలానికి తీసుకువస్తే..

07/02/2016 - 08:15

ముంబయి, జూలై 1: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ టై-అప్ అయ్యింది. దీంతో ఇక ఎస్‌బిఐ ఖాతాదారులు నెలసరి వాయిదాల్లో (ఇఎమ్‌ఐ) ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అయితే వ్యక్తిగత రుణ వడ్డీరేటు (14 శాతం) వర్తిస్తుంది. ‘ఇలాంటి ఓ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

07/02/2016 - 08:15

కొత్తగూడెం, జూలై 1: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో సింగరేణి సంస్థ పది శాతం వృద్ధిరేటు సాధించాలనే సంకల్పంతో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ గడచిన మూడు మాసాల ఫలితాలను చూస్తే బొగ్గు ఉత్పత్తిలో సంస్థ వెనుకంజలో ఉంది. కోటి 56 లక్షల 13 వేల టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా, కోటి 41 లక్షల 6 వేల 285 టన్నులు సాధించి 90 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది.

07/02/2016 - 08:09

హైదరాబాద్, జూలై 1: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దళితుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్నదని బిజెపి అనుబంధ విభాగమైన ఎస్‌సి మోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ గౌతమ్ అన్నారు. శుక్రవారం ఇక్కడి బిజెపి కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఎస్‌సి మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బిజెపి హయాంలోనే దళితుల సంక్షేమం జరుగుతుందని అన్నారు.

07/02/2016 - 08:09

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఎంపిక పరీక్ష ప్యాటర్న్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రూప్స్ తరహాలో ఎంపిక పరీక్ష విధానాన్ని మార్చేసింది. రెసిడెన్షియల్ స్కూళ్లలోని 2444 పో స్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Pages