S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 13:45

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌-ఆదిభట్లలో టాటా-బోయింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, టాటా-బోయింగ్‌ సంస్థ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

06/18/2016 - 13:42

బీజింగ్‌: చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్‌ ప్రాంతంలో వరదల కారణంగా ఆరుగురు మృతిచెందగా ఇద్దరు గల్లంతయ్యారు. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 39,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 5,000 మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

06/18/2016 - 13:39

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఆదిభట్లలో కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ టాటా-బోయింగ్‌ ఏరోస్పేస్‌ సంస్థ యూనిట్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల వ్యయంతో 3 నెలల్లో ఏరోస్పేస్‌ యూనిట్‌ పూర్తికానుంది.

06/18/2016 - 13:12

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు.

06/18/2016 - 13:09

విజయవాడ: వారం రోజుల్లో గ్రూప్స్‌ పరీక్షలకు కొత్త సిలబస్‌ ఖరారు చేస్తామని, రెండు నెలల్లో గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ వెలువరిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ శనివారం తెలిపారు. నిరుద్యోగులు ఓటీపీఆర్‌ నమోదు చేసుకోవాలని, ఖాళీలపై శాఖాధిపతులతో సమావేశమై రోస్టర్‌ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు.

06/18/2016 - 13:06

కరీంనగర్‌ : గోదావరిఖని ఇంక్‌లైన్‌ కాలనీలో శివారులోని నీటి గుంటలో పడి శనివారం ఉదయం ఇద్దరు చిన్నారులు మోహిస్‌(8), తల్మాన్‌(8) మృతి చెందారు. ఇంక్‌లైన్‌ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

06/18/2016 - 13:02

తిరుమల: శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలలో రెండో రోజు శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి హోమాలు, స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తిరువీధుల్లో వూరేగనున్నారు. ఆదివారంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

06/18/2016 - 12:32

రాజమండ్రి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ముద్రగడకు ప్రస్తుతం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు.

06/18/2016 - 12:32

హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నాయకులతో శనివారం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, తెరాసలోకి వలసలు, భవిష్యత్ కార్యక్రమాలపై ఆయన చర్చించారు. టి.టిడిపి నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

06/18/2016 - 12:31

హైదరాబాద్: కూరగాయలు, ఇతర నిత్యావసర సరకుల ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో శనివారం ఉదయం ఇక్కడ మార్కెటింగ్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Pages