S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 07:27

హైదరాబాద్, జూన్ 17:రాష్ట్రానికి చెందిన అవిభక్త కవలలు వీణ- వాణి శస్తచ్రికిత్స అవకాశాలపై మెల్‌బోర్న్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ చిల్డ్రన్స్ హాస్పటల్ డాక్టర్లతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి చర్చించారు. మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు అయింది.

06/18/2016 - 07:27

హైదరాబాద్, జూన్ 17: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో కూడా బిజెపి ఘన విజయం సాధిస్తుందని, భవిష్యత్ కూడా మనదేనని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చినపుడు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చిన వెంకయ్యకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

06/18/2016 - 06:59

న్యూఢిల్లీ, జూన్ 17: ఆర్థిక ఉగ్రవాద నిరోధన, సైబర్ భద్రత వంటి కీలకాంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని భారత్, థాయ్‌లాండ్‌లు శుక్రవారం నిర్ణయించాయి. అలాగే రక్షణ, తీరప్రాంత భద్రత విషయంలోనూ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

06/18/2016 - 06:57

బెంగళూరు, జూన్ 17: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ రూపొందించిన శిక్షణ విమానం శుక్రవారం తొలిసారిగా టేకాఫ్ అయింది. రెండు సీట్ల సామర్థ్యం కలిగిన ఈ శిక్షణ విమానం ప్రారంభోత్సవానికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హాజరయ్యారు. హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన తొలి టేకాఫ్‌లో గ్రూప్ కెప్టెన్లు సి.సుబ్రమణియం, వేణుగోపాల్ పాల్గొన్నారు.

06/18/2016 - 06:56

చండీగఢ్, జూన్ 17: ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యోగా దినోత్సవం జరిగే ప్రధాన వేదిక పరిసరాల్లో ఐదువేల మంది పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలతో భద్రతా చర్యలు చేపడుతున్నారు.

06/18/2016 - 06:56

ఏలూరు, జూన్ 17 : జల్సాలు, షికార్లకు అలవాటుపడిన యువత పక్కదారి పట్టింది. చివరకు బంధువుల ఇంటిలోనే దోపిడీ సీన్ చిత్రించి బంగారాన్ని దొంగతనం చేశారు. చివరకు పోలీసుల విచారణలో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న యువతీయువకులు కటకటాల పాలయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. స్థానిక పవర్‌పేటలో నివాసముంటున్న ఎన్ సరస్వతి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది.

06/18/2016 - 06:55

వాషింగ్టన్, జూన్ 17: దేశంలో అత్యంత కఠినమైన రీతిలో తుపాకుల లైసెన్స్‌లకు సంబంధించిన చట్టాలను అమల చేయకపోతే ఓర్లాండో తరహా భయానక మారణకాండలు పునరావృతం అవుతూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ తరహాలో ఉగ్రవాద చర్యలకు విఘాతక కృత్యాలకు పాల్పడే ప్రతి ఒక్కరినీ గుర్తించడం, నియంత్రించడం, వారి ఆలోచనలను ముందుగానే పసిగట్టడం అనేది ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

06/18/2016 - 06:54

ఏలూరు, జూన్ 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 20వ తేదీన ఉదయం నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటున్న దృష్ట్యా పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను కోరారు.

06/18/2016 - 06:54

బెంగళూరు, జూన్ 17: ఉగ్రవాద ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగడం అంటే దేశ ఇంటెలిజన్స్ పెరిగిందని, అలాగే ఉగ్రవాద వ్యతిరేక నెట్‌వర్క్ మరింత బిగుస్తోందని దాని అర్థమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.

06/18/2016 - 06:54

నరసాపురం, జూన్ 17: ఈనెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఖరారుకావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లల్లో నిమగ్నమైంది. నరసాపురం మండలం చిట్టవరంలో ఏర్పాటుచేసిన ఏరువాక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న దృష్ట్యా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏరువాక కార్యక్రమానికి సిఎం చంద్రబాబు ఎద్దుల బండిపై వెళ్ళే విధంగా 25 ఎద్దుల బండ్లు సిద్ధంచేశారు.

Pages