S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 06:43

వీరవాసరం, జూన్ 17: వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో శుక్రవారం వరిచేలల్లో మట్టిని తవ్విస్తుండగా రెవెన్యూ అధికారులు ట్రాక్టర్, జెసిబిని అదుపులోకి తీసుకున్నారు. రాయకుదురుకు చెందిన ఒక వ్యక్తి తన పంట చేలల్లోని మట్టిని తరలిస్తుండగా ఆర్‌ఐ సుధీర్, విఆర్వోలు మట్టి ట్రాక్టర్లను నిలుపుదల చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన సీనరైజేషన్ చెల్లించాలని రైతులకు తెలిపారు.

06/18/2016 - 06:43

ఏలూరు, జూన్ 17 : ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు సాంఘిక సంక్షేమ శాఖలోని నాల్గవ తరగతి ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా బదిలీలకు దరఖాస్తులు చేశారు. నిబంధనల్లో స్వగ్రామమై వుండకూడదని, గతంలో చేసిన స్థానం అయి వుండరాదని, బంధుమిత్రులు వున్న ప్రాంతం ఉండకూడదని, అత్తవారి ఇల్లు కూడా వుండకూడదని ఈ మేరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు ఆన్‌లైన్ దరఖాస్తులు అందించారు.

06/18/2016 - 06:40

పాడేరు, జూన్ 17: పాడేరు ఎఎస్పీ కె.శశికుమార్ ఆత్మహత్య ఘటనపై విచారణ చేసేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఎఎస్పీ శశికుమార్ గురువారం ఉదయం తన కార్యాలయంలో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని సిఐడి విచారణకు ఆదేశించారు.

06/18/2016 - 06:39

పరవాడ, జూన్ 17: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) రెండో యూనిట్ శుక్రవారం అధికారులు లైటప్ చేశారు. సింహాద్రి రెండవ యూనిట్‌లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు సాంకేతిక లోపంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది. దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. అయితే రెండవ యూనిట్‌కు సంబంధించిన టర్బైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.

06/18/2016 - 06:39

నాతవరం, జూన్ 17: మండలంలో ఎ.పి.పురం గ్రామంలో కలుషిత చలిమిడి తిని ఆస్వస్థతకు గురైన వారు క్షేమంగా ఉన్నారని నాతవరం పి.హెచ్.సి. డాక్టర్ ఎల్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పంచాయతీలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన తొండా నాగమణి అత్తవారింటికి సారెగా చలివిడి తీసుకువచ్చిందన్నారు.

06/18/2016 - 06:38

ముంబయి, జూన్ 17: మదుపరులు, నిర్మాణరంగ వర్గాలను ఆకట్టుకోవడానికి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టు (ఆర్‌ఇఐటి లేదా రిట్)ల నిబంధనలను సరళతరం చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన బోర్డు సమావేశంలో ఆర్‌ఇఐటిలపై ఆంక్షలను తొలగించేందుకూ సెబీ ప్రతిపాదనలు చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తుల్లో మరిన్ని పెట్టుబడులకు ఆర్‌ఇఐటిని అనుమతించింది.

06/18/2016 - 06:38

మునగపాక, జూన్ 17: అంగన్‌వాడీ భవనాలు శంకుస్థాపన చేయడానికి ఏర్పా టు చేసిన శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై ఏ చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుచే శంకుస్థాపన కార్యక్రమం కోసం సర్పంచ్ శిలాఫలకం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఒక వర్గం వారు గురువారం రాత్రి దానిని ధ్వంసం చేశారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

06/18/2016 - 06:38

మునగపాక, జూన్ 17: తనకు తెలియకుండా కొంతమంది నాయకులు తప్పుడు సమాచారాలు అందించి సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దుచేయడానికి ప్రయత్నిస్తున్న వారి అంతుచూస్తానని, చేతకాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల పార్టీ కార్యాలయం ఆవరణలో విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు ఆవేశంగా సమాధానం ఇచ్చారు.

06/18/2016 - 06:37

పాడేరు, జూన్ 17: కూలికి వెళితేగాని పూట గడవని పేదరికంలోనూ నర్సింగ్ కోర్సు చదవాలని తపన పడిన గిరిజన యువతికి అనారోగ్యం అడ్డంకిగా మారితే మానవత్వం తో స్పందించిన పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి బాసటగా నిలిచారు. దీంతో తన ఆశయాన్ని యువతి నెరవేర్చుకోగలిగింది.

06/18/2016 - 06:37

న్యూఢిల్లీ, జూన్ 17: దేశీయ ఎగుమతులు మందగమనంలో సాగుతున్న వేళ మే నెలలో మళ్లీ పుంజుకున్న సంకేతాలు వ్యక్తమయ్యాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో విదేశాలకు భారత ఎగుమతులు మరింతగా పెరిగేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

Pages