S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 22:27

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పరాజయం తరువాత వెంటనే సినిమాను మొదలుపెట్టాడు పవన్‌కళ్యాణ్. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఖుషి’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వలో పవన్ నటిస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఒకటి మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

06/18/2016 - 22:28

నాన్న మారిపోయాడు....
ఔను... ఆధునిక సమాజంలో..
మార్పులకు తగ్గట్టు...
కుటుంబానికి తగ్గట్టు...
ఆ మాటకొస్తే పిల్లలకు నచ్చినట్లు మారిపోయాడు...
చిన్నపిల్లలకు గురువుగా... వారికి వయసు పెరిగేకొద్దీ స్నేహితుడిగా.. వారికి పెళ్లయ్యాక మార్గదర్శిగా మారిపోయాడు.
కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు..
తన కలల రూపాలైన పిల్లల కోసం తల్లిలా మారిపోయాడు..

06/18/2016 - 22:11

ఆత్మ... పరమాత్మ - ఏది ముందు? ఏది వెనుక?
ప్రకృతి... పురుషుడు - ఎవరిది ముందడుగు? ఎవరిది వెనకడుగు?
విత్తు.. చెట్టు - దేనిది తొలి రూపం? దేనిది మలిరూపం?

06/18/2016 - 22:04

ఆయమ్మ ప్రతి నిత్యం 72 పనులు ఒకదాని తరువాత ఒకటి పొల్లువోకుండ చేస్తుంది. పనిలో ఉన్నప్పుడు మాటలుండవు. ఒక్క పని కూడా కొత్త పద్ధతిలో చేసేది లేదు. చేసే పనులలో రెండు పూటలా తులశమ్మ పూజ కూడ ఉన్నది. ఉండేది ఐదంతస్తుల భవనం. అన్నిటికన్నా మీది మాలెలో. అక్కడ పాదుచేసి చెట్లు పెంచేందుకు ఉండదాయె. తులశమ్మను ఈ మధ్యన వీలున్నవాండ్లు కూడా తొట్లలోనే పెంచుతున్నరు. ఇక్కడ కూడ చెట్టు తొట్టెలోనే ఉన్నది.

06/18/2016 - 21:45

గుర్రాలు, మరికొన్ని జంతువులు నిలబడే నిద్రపోతాయి. వాటి కాల్లు యాంత్రికంగా అలా ఒక ఆకృతిలో నిలబడి ఉంటాయి. వాటి కండరాల బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. నిలబడిన ప్రదేశంలో స్థిరంగా ఉండడానికి వీటికి మోకాళ్లు అవసరం. పెద్ద జంతువులు నిలబడి నిద్రపోవడమే మంచిది. పడుకుని ఉంటే శత్రు జంతువులు దాడి చేసినప్పుడు వెంటనే నిలబడి పరుగెత్తడానికి అవకాశముండదు.

06/18/2016 - 21:43

పెద్దవాళ్లు ఏది ఆచరిస్తే దానినే చిన్నవాళ్లు అనుసరిస్తారని భగవద్గీత బోధించింది. మంచి మర్యాదలు, పలకరింపులు, స్వాగతాలు, గుర్తుండిపోయే కన్నీటి వీడ్కోలు మధురంగా అనిపిస్తాయి. మనిషిని బ్రతికిస్తాయి. ప్రశాంతతను కలుగజేస్తాయి. ‘సండే గీత’ చిన్న మాటలతో గొప్ప విషయాన్ని బాగా చెప్పింది.
-ఎన్.ఆర్.లక్ష్మి (సికిందరాబాద్)

06/18/2016 - 21:29

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

06/18/2016 - 21:17

మన జీవితంలో ఉదయం చాలా ముఖ్యమైంది. లేవగానే చాలామంది పెద్దవాళ్లు భూమికి దండం పెట్టి లేచేవాళ్లు. సముప్ర వసనే దేవి... అంటూ ప్రార్థన చేసి రోజువారీ కార్యక్రమాలు మొదలుపెట్టేవాళ్లు. భూమి దేవతనా కాదానన్న విషయం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. భూమి మనల్ని రోజంతా మోస్తుంది. మరో రోజు మనకి భూమి మీద నివసించడానికి అవకాశం లభించింది. అందుకైనా దండం పెట్టడం అవసరం.

06/18/2016 - 21:14

గతంలోకి ప్రయాణించడం చాలామందికి అలవాటు. ప్రస్తుతం కన్నా గతం మధురమని చాలామంది తరచూ అనుకుంటూ వుంటారు. స్మృతులు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి. చిన్నప్పటి ఆటలు, పాటలు, వేషాలూ గుర్తుకు తెచ్చుకొని ఆనందించడం సహజం. అయితే మనందరం మరిచిపోతున్న విషయం ఒకటి ఉంది. ఈ రోజు కూడా కొద్ది రోజులకి గతం అవుతుంది. ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాల తరువాత ఓ మధుర స్మృతి అవుతుంది.

Pages