S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 08:30

సత్తుపల్లి, జూన్ 16 : ఆంధ్రా న్యాయాధికారులు అప్షన్‌ను వెనక్కు తీసుకొని ప్రత్యేక తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మున్సిఫ్ కోర్టు వద్ద గురువారం న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు సహపంక్తి బోజనాలు చేశారు.

06/17/2016 - 08:30

వైరా, జూన్ 16: తెలంగాణ రాష్ట్ర సమితిలో నాయకుల మధ్య విభేదాలతో ముసలం ప్రారంభమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం స్థానిక నీటిపారుదల శాఖ విశ్రాంతి భవనంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలనను కేవలం కెసిఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురు మాత్రమే శాసిస్తున్నారని ఏద్దేవా చేశారు.

06/17/2016 - 08:28

కొత్తగూడెం, జూన్ 16: సింగరేణి సంస్థను జెబిసిసిఐ నుండి మినహాయించడం లేదని హైద్రాబాద్‌లో గురువారం తనను కలిసిన జాతీయ కార్మికసంఘాల నాయకులకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ హామీ ఇచ్చారు. సిఎండి శ్రీ్ధర్‌కు జాతీయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

06/17/2016 - 08:27

నాగార్జున యూనివర్సిటీ, జూన్ 16: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివిధ శాఖలలో అక్రమాలు జరిగాయని పత్రికలలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ గురువారం నుండి విచారణ చేపట్టనుంది. ఇష్టానుసారం జరిగిన సిబ్బంది నియమకాలు, అనర్హులకు పదోన్నతులు కల్పించటం వంటి పలు అక్రమాలపై పలు కథనాలు రావటంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

06/17/2016 - 08:24

ప్రత్తిపాడు, జూన్ 16: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష గురువారం 8వ రోజుకు చేరుకోవడంతో కిర్లంపూడి మండలంలో ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తమ నాయకుడిని చూడడానికి వెళ్ళనీయకుండా పోలీసులు నిరోధించడం అన్యాయమని, కనీసం టివీల ద్వారానైనా ముద్రగడను తమకు చూపించాలని కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం మహిళలు అడ్డురోడ్డుపై బైఠాయించారు.

06/17/2016 - 08:21

తిరుచానూరు, జూన్ 16: కలియుగ ప్రత్యక్షదైవంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి స్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

06/17/2016 - 08:19

కడప, జూన్ 16:రాయలసీమ జిల్లాల్లో మావోయిస్టుల అగ్రనేతగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్న గజ్జల కృష్ణారెడ్డి అలియాస్ రమణారెడ్డి (58) గురువారం కర్నూలులో రాయలసీమ జోన్ ఐజి శ్రీ్ధర్ వద్ద లొంగిపోయారు. ఆయన జిల్లాలోని వీరపునాయునిపల్లె మండ లం అనిమెలకు చెందిన రిటైర్డ్ టీచర్ గజ్జల చెన్నారెడ్డి కుమారుడు. ఆయన తల్లి చిన్నతనంలో మరణించగా చెన్నారెడ్డి 15 ఏళ్ల క్రితం మరణించాడు.

06/17/2016 - 08:16

అనంతపురం, జూన్ 16 : జాతీయ రహదారుల అభివృద్ధి చర్యల్లో భాగంగా ఓవర్ బ్రిడ్జిలతోపాటు మరో మూడు టోల్‌గేట్లు నిర్మించే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిధిలోని 42వ నంబర్ జాతీయ రహదారిలోని ఉరవకొండ- అనంతపురం-కృష్ణగిరి మార్గం, అనంతపురం-మదనపల్లి మధ్య ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. వీటిలో ముదిగుబ్బ శివారులోని రైల్వే క్రాసింగ్‌పై రూ.83.03 కోట్లతో ఒక ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు.

06/17/2016 - 08:15

అనంతపురంటౌన్, జూన్ 16: అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల తరహాలో తెలుగుదేశం ఎంపి జె.సి.దివాకరరెడ్డి, ఎమ్మెల్యే వి.ప్రభాకరచౌదరిలు గురువారంనాటి అనంత కౌన్సిల్ సమావేశంలో ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో ప్రసంగాలు చేశారు. వారు సభలో ఉన్నంతసేపు కౌన్సిల్‌లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది. కౌన్సిల్‌లో పోలీసులు ప్రవేశించి ఎలాంటి పరిస్థితినైనా అదుపుచేసే క్రమంలో సిద్ధమయ్యారు.

06/17/2016 - 08:13

హైదరాబాద్, జూన్ 16:అర్హులైన లబ్దిదారులందరికీ జూలై ఆఖరు నాటికి రేషన్ కార్డులు అందజేయనున్నట్టు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి నిర్దేశిత కోటా ప్రకారం బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులతో మంత్రి ఈటల గురువారం పౌర సరఫరాల శాఖపై సమావేశం జరిపారు.

Pages