S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 08:03

వలిగొండ, జూన్ 16: కొడుకా.. ఏడున్నావురా.. కడచూపుకైనా రారా.. అంటూ మావోయిస్టు ఆంధ్ర-ఒరిస్సా బార్డర్ కార్యదర్శి శ్యామల కిష్టయ్య అలియాస్ దయ తల్లి శ్యామల చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెంకు చెందిన శ్యామల కిష్టయ్య అలియాస్ దయ దాదాపు 24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

06/17/2016 - 08:02

భద్రాచలం, జూన్ 16: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక వివాదం రాజుకుంది. తెలంగాణలోని ఇసుక ర్యాంపుల నుంచి వస్తున్న లారీలను తమ రాష్ట్రంలో పర్మిట్ లేదంటూ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ తంతు నడుస్తోంది. కేవలం ఇసుక లారీలనే ఆపి ఆంధ్రా పోలీసులు వేధిస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు.

06/17/2016 - 08:02

మహబూబ్‌నగర్, జూన్ 16: మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోని ధర్మాపూర్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల బారిన పడ్డారు. ఈ ప్రమాదానికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని దేవరకద్ర నుండి టిఎస్06జడ్0197 నంబర్ గల ఆర్టసీ బస్సు, ఏపి22ఎక్స్ 3640నంబర్ గల ఆటోను మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలో గల ధర్మాపూర్ దగ్గర ఢీకొట్టింది.

06/17/2016 - 08:01

న్యూఢిల్లీ, జూన్ 16: తెలంగాణకు కేంద్ర చేసిన సహాయం విషయంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా అవాస్తవాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి విమర్శించారు. ఢిల్లీలో గురువారం వేణుగోపాలాచారి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు.

06/17/2016 - 08:00

న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల పథకం జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించింది. కరీంనగర్ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ఎంపీ వినోద్‌కుమార్ గురువారం ఇక్కడ పిలుపునిచ్చారు.

06/17/2016 - 08:00

ఆదిలాబాద్, జూన్ 16: పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించి బేరసారాలు, ప్రలోభాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, టిఆర్‌ఎస్ కుటిల రాజకీయాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం సాగిస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు.

06/17/2016 - 07:53

మహదేవపూర్, జూన్ 16: కరీంనగర్ మహదేవపూర్ మండ లంలో జిల్లా త్రివేణి సంగమమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో గురువారం వరుణ యాగం నిర్వహించారు. మూడు నదుల సంగమమంలోని గోదావరి జలాలను కలశాల ద్వారా స్వామివారి ఆలయానికి తీసుకువచ్చి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక జలాభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలయ ఈఓ హరిప్రకాష్ అన్నారు.

06/17/2016 - 07:52

నల్లగొండ, జూన్ 16: కాంట్రాక్టుల కోసమే తాము టిఆర్‌ఎస్‌లో చేరామంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఎంపి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించడం పూర్తి అవాస్తవమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు ఖండించారు.

06/17/2016 - 07:45

తాడేపల్లి, జూన్ 16: రహదారుల విస్తరణ కోసం రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలోని సుమారు 20 ఇళ్ళు తొలగించే విషయంలో అధికారులకు, స్థానికులకు మధ్య వివాదం నెలకొంది. గత రెండు వారాలుగా రహదారుల వెడల్పుకు రోడ్డు పక్కనే ఉన్న నివాసాలకు అధికారులు మార్కింగ్ చేశారు.

06/17/2016 - 07:43

విశాఖపట్నం, జూన్ 16: వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు జరిగేలా చూడాలని కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు రాష్టప్రతి, కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రాలను పంపనున్నట్లు వెల్లడించారు.

Pages