S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 04:34

విజయవాడ (కార్పొరేషన్), మే 2: నగర విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి నగర కీర్తి ప్రతిష్ఠను పెంపొందించాలన్న లక్ష్యంతోనే విఎం సి ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబరాలను నిర్వహిస్తున్నట్టు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

05/03/2016 - 04:33

విజయవాడ (కల్చరల్), మే 2: రాష్ట్రంలో కరవు కోరలు చాస్తున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటంలో మొండి వైఖరి అవలంభిస్తోందని ఖాళీ బిందెలతో వైఎస్‌ఆర్‌సిపి నేతలు నిరసన తెలుపుతూ ఎంఆర్‌ఓ ఆఫీసు ముందు ధర్నాచేసి ఎంఆర్‌ఓకు మెమోరాండం సమర్పించారు. సోమవారం ఉదయం గాంధీనగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ నేతలు పలు సెంటర్లలో ర్యాలీ నిర్వహించి ఎంఆర్‌ఓకు కార్యాలయం ఎదుట ధర్నా చేసారు.

05/03/2016 - 04:30

విజయవాడ (స్పోర్ట్స్), మే 2: రుతుపవనాల వైఫల్యం వలనే వర్షాలు కురవడంలో వ్యత్యాసం చూస్తున్నామని, వాన నీటి బాంఢాగారంగా భూమిని మలచినప్పుడే నీటి లభ్యత పెరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంకుడు గుంతల అవగాహన పరుగు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

05/03/2016 - 04:29

విజయవాడ, మే 2: జూన్‌లో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఎపి ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు వెల్లడించారు.

05/03/2016 - 04:28

విజయవాడ (క్రైం), మే 2: పాత్రికేయులపై దాడులు నిరోధించేందుకు రాష్టస్థ్రాయిలో హోం మంత్రి ఆధ్వర్యాన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రమాద బీమా పథకం ధృవపత్రాలను పాత్రికేయులకు పంపిణీ చేశారు.

05/03/2016 - 04:26

విజయవాడ (క్రైం), మే 2: పాత ప్రభుత్వాస్పత్రిలో శిశువు మరణం పట్ల విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన రాజకీయ పార్టీ నేతలు అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. చీమలు కుట్టి శిశువు మృతి చెందడం పట్ల తీవ్రంగా స్పందించిన వివిధ రాజకీయ పార్టీలు సోమవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించాయి.

05/03/2016 - 04:25

విజయవాడ, మే 2: దుర్గాఘాట్, ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ విస్తరణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్, ఫెర్రీఘాట్ విస్తరణపై జలవనరులశాఖ అధికారులు, చైనా టీం, మున్సిపల్ కార్పొరేషన్, సోమా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

05/03/2016 - 03:40

న్యూఢిల్లీ, మే 2: ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియాని.. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గ్రూప్ వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే బియాని ఎండి పదవిని వదులుకున్నారు. అలాగే సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ పదవులకు రాకేశ్ బియాని సైతం రాజీనామా చేశారు.

05/03/2016 - 03:40

న్యూఢిల్లీ, మే 2: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో గతంతో పోల్చితే 30.76 శాతం వృద్ధి చెందింది. 3,460.46 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ లాభం 2,646.35 కోట్ల రూపాయలుగా ఉంది.

05/03/2016 - 03:39

హైదరాబాద్, మే 2: ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ తీసుకువచ్చిన పలు సంస్కరణలు సఫలీకృతమవుతున్నాయ. ముఖ్యంగా ఖైదీలతో పనిచేయిస్తుండటం, చేతి వృత్తుల్లో అనుభవమున్న వారిని ప్రోత్సహిస్తుండటం లాభిస్తోంది. దీంతో వారిలో నైపుణ్యత, వారి ఉత్పత్తుల నాణ్యతపై జైళ్ల శాఖ దృష్టి సారిస్తోంది. ఖైదీలు తయారుచేస్తున్న పలు రకాల ఉత్పత్తులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సరసమైన ధరలకు జైళ్ల శాఖ విక్రయిస్తోంది.

Pages