S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 02:18

న్యూఢిల్లీ, మే 2: కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘్ఢల్లీ దండోరా’ నినాదంతో ధర్నా నిర్వహించారు. ధర్నాలో టిఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొని సంఘీభావం తెలిపారు.

05/03/2016 - 04:19

ఒంగోలు,మే 2: మాజీ ఎంఎల్‌సి, యుటిఎఫ్ రాష్టమ్రాజీ అధ్యక్షుడు దాసూరి రామిరెడ్డి సోమవారం ఒంగోలులో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒంగోలులోని ఒకప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. రామిరెడ్డి భౌతికకాయాన్ని స్ధానిక యుటిఎఫ్ కార్యాలయంలో పలువురు సందర్శనార్ధం ఉంచారు. ఆయన భౌతికాయాన్ని పలువురు రాజకీయ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు.

05/03/2016 - 02:11

న్యూఢిల్లీ, మే 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి.రామచందర్‌రావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ దానిని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

05/03/2016 - 02:10

హైదరాబాద్, మే 2: వైఎస్సార్ కాంగ్రెస్‌పై ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం కావడంతో, మలిదఫా కాంగ్రెస్‌పై తెరాస దృష్టి సారించింది. ఈనెల 26న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలోగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, తెదేపా నుంచి ఒక్కరు తెరాసలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.

05/03/2016 - 02:09

ఇబ్రహీంపట్నం, మే 2: ప్రతి మండలాన్ని కరువుప్రాంతంగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి జి.మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోరెడ్డి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. కరువు నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

05/03/2016 - 02:08

ఖైరతాబాద్, మే 2: మన తెలంగాణ - మన వ్యవసాయం పేరిట విధ్వంసాన్ని సృష్టించే పంట పద్ధతులను పాటించడం సరికాదని డక్కన్ డవలప్‌మెంట్ సొసైటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

05/03/2016 - 02:07

ఇబ్రహీంపట్నం, మే 2: పంటలు వేసుకునే ముందు రైతులు భాసార పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, తద్వారా భూసారాన్ని బట్టి విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన ఏర్పడుతుందని వ్యవసాయశాఖ అధికారిణి కవిత సూచించారు. సోమవారం మండల పరిధిలోని కొంగరకలాన్, మంగళ్‌పల్లి గ్రామాల్లో మన తెలంగాణ-మన వ్యవసాయం పేరిట రైతు అవగాహణ సదస్సును నిర్వహించారు. వ్యవసాయాధికారులు, శాస్తవ్రేత్తల సూచనలు తప్పకుండా పాటించాలని అన్నారు.

05/03/2016 - 02:07

హైదరాబాద్, మే 2: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని కష్టకాలం ఎదురైంది. కొనఊపిరితో ఉన్న ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడబోతున్నది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఇప్పటికే కారెక్కేయగా.. మిగిలి ఉన్న ఖమ్మం వైకాపా లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (పినపాక) కూడా బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.

05/03/2016 - 02:05

హైదరాబాద్, మే 2: కంటోనె్మంట్ లోని తొమ్మిది రహదారులను మూసేస్తే నగరం అస్తవ్యస్థం అవుతుందని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. రోడ్లను మూసివేయాలని రక్షణ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టడానికి పూర్తి స్థాయి అధ్యయనం చేసినట్టు కెటిఆర్ తెలిపారు.

05/03/2016 - 02:04

ఖైరతాబాద్, మే 2: ఆన్‌లైన్‌లో పరిచయమై పెళ్లి చేసుకున్న మూడవ రోజే వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వరంగల్‌కు చెందిన బాధితురాలు ప్రశాంతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తనకు న్యాయం జరగకపోతే సిఎం క్యాంపు ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

Pages