S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 03:14

రాజ్‌కోట్, మే 2: అంపైర్ నిర్ణయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను మ్యాచ్ రిఫరీ ఎం. నయ్యర్ మందలించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జడేజా నిరసన ధోరణిని ప్రదర్శించాడు.

05/03/2016 - 03:14

వెల్లింగ్టన్, మే 2: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫ్రాంక్లిన్ రోజ్‌ను న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గెంటేశారు. అనుమతించిన కాలం పూర్తయినప్పటికీ, అనధికారికంగా న్యూజిలాండ్‌లో ఉంటున్న అతనిపై కేసు నడిచింది. ఐదు వారాల శిక్షను అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అధికారులు అతనిని జమైకా విమానం ఎక్కించారు.

05/03/2016 - 03:13

మాడ్రిడ్, మే 2: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో బార్సిలోనా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తాజా మ్యాచ్‌లో ఆ జట్టు రియల్ బెటిస్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఇవాన్ రకిటిక్, లూయిస్ సౌరెజ్ చెరొక గోల్ చేసి బార్సిలోనాను గెలిపించారు. మరో మ్యాచ్‌లో అట్లెటికో మాడ్రిడ్ 1-0 తేడాతో రయో వలెకానోపై గెలిచింది. ఆంటోనీ గ్రీజ్మన్ కీలకమైన గోల్ చేసి అట్లెటికోకు విజయాన్ని సాధించిపెట్టాడు.

05/03/2016 - 03:11

మాడ్రిడ్, మే 2: ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహక ఈవెంట్‌గా పేర్కొనే మాడ్రిడ్ ఓపెన్ నుంచి టాప్ సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ చివరి క్షణంలో వైదొలగడంతో, టాప్ సీడింగ్ పోలాంగ్‌కు చెందిన రద్వాన్‌స్కాకు దక్కింది. టైటిల్ సాధించే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని క్రీడాపండితులు జోస్యం చెప్పారు.

05/03/2016 - 02:54

న్యూఢిల్లీ, మే 2: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తిరిగి స్వర్ణయుగం తీసుకువచ్చేందుకు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తురుపుముక్కల్ని ప్రయోగిస్తున్నారు. వచ్చే సంవత్సరం యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీకి ప్రచార వ్యూహకర్తగా..

05/03/2016 - 02:52

రోమ్, మే 2: ఢిల్లీలో నాలుగేళ్లకు పైగా కాలం నుంచి నిర్బంధంలో ఉన్న ఇటలీ నావికుడిని భారత్ విడుదల చేయాలని, అతన్ని స్వదేశానికి వెళ్లనివ్వాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆర్బిట్రేషన్ కోర్టు ప్రాథమికంగా తీర్పు ఇచ్చిందని ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. అయితే ఈ కేసు విచారణ ఆర్బిట్రేషన్ కోర్టులో కొనసాగుతుందని పేర్కొంది.

05/03/2016 - 02:50

పాల, మే 2: కేరళలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు, ఓటమంటే ఎరగని కేరళ కాంగ్రెస్ (ఎం) అధినేత కెఎం మణి 13వ సారి పాల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. 83 ఏళ్ల మణి ఇదే నియోజకవర్గం నుంచి 12 సార్లు గెలిచారు. ఈ నెల 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభ్యునిగా స్వర్ణోత్సం జరుపుకొన్న మణి మళ్లీ గెలవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

05/03/2016 - 02:47

కొచ్చి, మే 2: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి విధానపరమైన జాప్యం జరగలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం స్పష్టం చేశారు. న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు.

05/03/2016 - 02:45

వాషింగ్టన్, మే 2: భారత్, చైనా వంటి ఆసియా దేశాలలో వేగంగా పెరుగుతున్న బొగ్గు వినియోగం వల్ల భవిష్యత్తులో రుతుపవన వ్యవస్థలు బలహీనపడే అవకాశం ఉందని, తద్వారా వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

05/03/2016 - 02:43

న్యూఢిల్లీ, మే 2: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం రంగంలోకి దిగింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున దీనికి చెక్‌పెట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తప్పతాగి వాహనాలు నడపడం వల్లే గత ఐదేళ్లలో 1,18,840 మంది మృతి చెందారు.

Pages