S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 16:53

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ విషయమై కేంద్రంతో మాట్లాడేందుకు ఈనెల 10లోగా దిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వర్గీకరణపై పార్లమెంటులో బిల్లు తేవాలని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న ఎంఆర్‌పిఎస్ నాయకులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. వర్గీకరణకు గతంలోనే తాము అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.

05/02/2016 - 16:53

విజయవాడ: కొన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 400 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎపి మంత్రిమండలి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 20వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింటికీ కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.

05/02/2016 - 16:52

విజయవాడ: తెలంగాణలో చేపడుతున్న కొన్ని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. ఈమేరకు సోమవారం ఇక్కడ సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానించారు. ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలని కూడా నిర్ణయించారని సమాచారం.

05/02/2016 - 16:52

మెదక్: దేగుల్‌వాడీ తండాలో విద్యుత్ షాక్‌తో మరణించిన వారి కుటుంబాలను మంత్రి హరీష్ రావు సోమవారం పరామర్శించారు. ఆదివారం రాత్రి పెళ్లి బృందానికి చెందిన లారీ వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు వేలాడుతున్నా చర్యలు తీసుకోని విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

05/02/2016 - 16:51

విజయవాడ: వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మృతి చెందింది. ఇక్కడ పాత జిల్లా ఆసుపత్రిలో మూడురోజుల క్రితం ఓ శిశువు జన్మించింది. అనారోగ్యంగా ఉండడంతో శిశువుకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం సెలైన్ బాటిల్ పడి శిశువు మృతిచెందినట్లు మిగతా రోగులు చెబుతున్నారు.

05/02/2016 - 16:51

ఆదిలాబాద్: వడదెబ్బకు గురై, తాగేందుకు మంచినీళ్లు దొరక్క ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నూరు మండలం ముద్దారం అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లింగంపల్లి నుంచి ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు అటవీప్రాంతం గుండా నడిచి వెళ్తుండగా దాహార్తి సమస్య వీరిని వెంటాడింది.

05/02/2016 - 16:50

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం రాజ్యసభను సోమవారం కుదిపేసింది. ఈ కుంభకోణం విషయమై రక్షణమంత్రి పారికర్ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు అగస్టాపై చర్చకు ససేమిరా అంటున్నారు. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో నిధుల స్వాహాపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు.

05/02/2016 - 16:50

దిల్లీ: యుపిఎ హయంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, వాటిని లోక్‌సభలో చర్చించకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని, వాటిపై చర్చకు ఆ పార్టీ ఎంపీలు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు.

05/02/2016 - 16:49

గుంటూరు: ఎపిలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు, కూలీలు, సామాన్య ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. ఆయన సోమవారం మాచర్లలో వైకాపా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నారని, తాగునీటి సమస్యపై దృష్టి సారించడం లేదని అన్నారు.

05/02/2016 - 16:49

నల్గొండ: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతోపాటు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్రంపాడు మండలం జూనూతలలో సోమవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Pages