S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 00:41

‘శ్రీకృష్ణునకు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, కాళింది, లక్షణ అనువారు ఎనిమిది మంది (అష్ట) భార్యలుగా కీర్తించబడుతున్నారు. అష్ట్భార్యలు సృష్టిలో అష్టవిధ ప్రకృతులకు ప్రతీకలు. అష్టమహిషులతో శ్రీకృష్ణ కళ్యాణ వైభవాన్ని మహాకవి పోతన తమ భాగవతంలో అత్యంత మనోహరంగా వర్ణించారు. తరువాతి కాలంలో ప్రసిద్ధ కవులు కొందరు వ్రాసారు.

05/03/2016 - 00:36

హైదరాబాద్‌లోని పార్కులలో కొన్ని సరైన పర్యవేక్షణ లేక దుస్థితిలో ఉన్నాయి. చెత్తాచెదారం వలన ఉద్యానవనాల్లోకి వెళ్లాలంటేనే చాలామంది జంకుతున్నారు. మొక్కలు, చెట్లు ‘పోషణ’ లేనందువలన శోషిల్లుతున్నాయి. పరిసరాల నుండి శబ్దకాలుష్యం ఇతర కాలుష్యాలు ఎలాగూ తప్పవు. కొన్ని పార్కులకైతే ప్రహరీగోడలు కూడా లేవు. కాపలాదారులు ఉన్న పార్కులలో ప్రేమికులు అనబడేవారి వెకిలి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. కాపలావారకి లంచాలే లంచాలు!

05/03/2016 - 00:32

దేశవ్యతిరేక విచ్ఛిన్న వాదులపై మన ప్రభుత్వం జరుపుతున్న పోరాటం కథ మళ్లీ మొదటికి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో దేశ విద్రోహ కలాపాలకు నాయకత్వం వహిస్తున్న హురియత్ ముఠాలవారు ఏ దేశపు ప్రతినిధులతోనైనా చర్చలు జరపడంపై ఎలాంటి నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం, స్పష్టం చేయడం కథ మొదటికి వచ్చిందనడానికి సాక్ష్యం.

05/02/2016 - 23:29

శామ్యూల్ బ్రౌన్ ఇంగ్లీష్ దేశపు ఇంజనీర్. ఆయన 1823లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌ను అభివృద్ధి చేశాడు. ఇది న్యూకోమన్ రూపొందించిన ఆవిరి ఇంజన్‌కు మెరుగైన రూపం. అయితే దీంట్లో ఇది ఆవిరికి బదులుగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడారు. దీనిలో కంబషన్, కూలింగ్‌కు వేర్వేరు చాంబర్లు ఉంటాయి. దీనిలో సిలిండర్లను కూడా వాడారు.

05/02/2016 - 23:26

విద్యుదయస్కాంత శక్తి యొక్క గుణాన్ని గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి స్కాట్లండ్‌కు చెందిన శాస్తజ్ఞ్రుడు జెమ్స్‌క్లార్క్ మాక్స్‌వెల్. ఆయన రూపొందించిన సమీకరణాలు, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల యొక్క లక్షణాలను మరియు పదార్థంతో వాటి యొక్క పరస్పర ప్రభావాన్ని వివరించాయి. విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు, ఒక స్థిరమైన చలన వేగంతో ఖాళీ ప్రాంతం గుండా ప్రయాణిస్తాయని ఆయన సిద్ధాంతీకరించాడు.

05/02/2016 - 23:25

ప్రథమ్ తన ఐదుగురు మిత్రులతో ఓ ఆదివారం సాయంత్రం ఊరి బయట ఉన్న తన మిత్రుడి తోటకి వెళ్లాడు. తోటమాలి వారికి తేగలని కాల్చి ఇచ్చాడు. తోటమాలి భార్య పూతరేకుల్ని, చెరకు రసాన్ని ఇచ్చింది. చివరకి వాళ్లు ఓ జామ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అందరికన్నా ఎవరు ఎక్కువ ఎత్తు ఎక్కుతారా అని పందెం వేసుకున్నారు. ఐదుగురు ఎక్కాక చివరగా ప్రథమ్ ఆరో వాడిగా చెట్టెక్కాడు.

05/02/2016 - 23:18

............
కర్మయోగ సాధకులకు ఈ
సమదృష్టి, సమభావనల
ఆవశ్యకత ఏమిటి? అంటే
సమస్థితచిత్తం వల్లనే వర్తమాన మానవ జన్మలోనే ఈ భౌతిక ప్రాపంచికతకు
అతీతం కాగలం.
...................

05/02/2016 - 23:06

మట్టిలో పండిన ఆహార పదార్థాలని తింటూంటాం కాని మట్టిని తినడానికి మనం ఇష్టపడం. కాని కొన్ని సందర్భాలలో మనిషి మట్టిని ఇష్టంగా తినడం జరుగుతుంది. కొందరు చిన్నపిల్లలు మట్టి తింటూంటారు. కొన్ని సంస్కృతుల్లో మట్టిని తినడం సంప్రదాయం కూడా. ఇలా మట్టిని తినడాన్ని జియోఫాజియా అని పిలుస్తారు.

05/02/2016 - 23:04

నాన్న నేర్పించిన అలవాట్లలో తాంబూలం కొనసాగడం లేదు. పుస్తకాలు చదవడం ఈ జన్మానికి వదలదు. సినిమాలు చూడడం మానేశాను. కానీ, అప్పుడప్పుడు కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. అంటే పాతవి అని చెప్పనవసరం లేదు. వాటిని చూడకుంటే నిద్ర పట్టదు. అట్లా ఈ మధ్య రెండు సినిమాలు మళ్లీ చూచాను. (్ఛదస్తమా? చూశాను అనాలా?) సినిమాలను మళ్లా, మళ్లీ, మరోసారి చూడడం కూడా ఛాదస్తమే.

05/02/2016 - 22:47

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
పాక్‌లో భారత పతాకం ఎగురవేసిన వానికి 10 ఏళ్లు కఠిన శిక్ష విధించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాక్‌కు జైకొట్టి పాక్ జెండా ఎగురవేసిన వారిని భారత్ శిక్షించలేదేం?
మనది అసమర్థ సజ్జనత్వం. అందుకే అందరికీ అలుసయ్యాం.

Pages