S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 21:01

ఆంధ్ర దిలీప్ చలం, రామకృష్ణ, లక్ష్మి, తమిళనాడు సిఎం జయలలితల కాంబినేషన్‌లో గొప్ప చిత్రంగా వచ్చిన దేవుడమ్మ చిత్రం గొప్ప చిత్రం. మనుషుల్లో రకరకాల స్వభావాలున్న వ్యక్తులుంటారు. అది మంచైనా చెడైనా మనం చూసిన దాన్నిబట్టే నిర్ణయించుకుంటాం. కానీ మంచి వారి మనసులో గొప్పతనం ఉండదని, మనం మంచి వారుకాదని అనుకున్న వారి జీవితంలో చాలా గొప్పదనం ఉంటుందని ఈ చిత్రం చెబుతుంది.

05/02/2016 - 20:58

మంచి మనసులు చిత్రంలోని ఘంటసాల ఆలపించిన అద్భుతమైన గీతం ‘అహో ఆంధ్రభోజ/ శ్రీకృష్ణదేవరాయ/ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాయ..’ అనే పాట నాకు చాలా ఇష్టమైనది. ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. రాయలకాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతూ సామాన్యుల జీవన స్థితిగతులు ఆ కాలంలో ఎలా ఉండేవో ఈ పాటలో చక్కగా వర్ణించారు.

05/02/2016 - 18:06

చెన్నై: తనకు పెళ్లి చేయడం లేదన్న ఆగ్రహంతో కన్నతల్లి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఓ కుమారుడి ఉన్మాదం ఇది. తమిళనాడులోని అరుంబాక్కంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమర్‌నాథ్ (40) అనే క్యాబ్ డ్రైవర్ తనకింకా పెళ్లి చేయడం లేదని తల్లి శశికళతో తరచూ గొడవపడేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అమర్‌నాథ్ తల్లిని కుర్చీకి కట్టేసి ఆమెకు నిపుపెట్టాడు.

05/02/2016 - 18:05

హైదరాబాద్: నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో హనుమాన్ ఆలయం వద్ద సోమవారం ఉదయం ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ ఆగంతకుడు లాక్కునిపోయాడు. చైన్‌స్నాచర్‌తో పెనుగులాడిన ఆ మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.

05/02/2016 - 18:05

విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజుల శిశువు అనుమానాస్పదంగా మరణించడంపై సమగ్ర విచారణ జరపాలని వైద్య,ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సంఘటన గురించి తెలిశాక లండన్‌లో ఉన్న ఆయన ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. శిశువుమృతిపై స్థానిక కాంగ్రెస్, వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆస్పత్రి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

05/02/2016 - 18:04

ఏలూరు: నడిరోడ్డుపై వెళుతున్న వారిపై ఓ ఉన్మాది విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో బాలుడు మరణించాడు. నిడదవోలు మండలం శెట్టుపేటలో సోమవారం ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

05/02/2016 - 18:04

హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను పునరుద్ధరించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులకు, తెలంగాణ సర్కారుకు మధ్య సోమవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించేందుకు ఇప్పటికే 117 కోట్లరూపాయలను విడుదల చేశామని చర్చల్లో పాల్గొన్న వైద్య,ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

05/02/2016 - 18:03

దిల్లీ: ఎస్సీ వర్గీకరణ విషయమై గతంలో ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకోవాలని లేకుంటే రెండు తెలుగురాష్ట్రాల్లో ఆ పార్టీ కనిపించకుండాపోతుందని తెరాస ఎంపీ కవిత అన్నారు. వర్గీకరణ బిల్లుకు తెరాస మద్దతు ఉంటుందని ఆమె సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా సహకరిస్తానని ఆమె ప్రకటించారు.

05/02/2016 - 18:03

ఖమ్మం: ఆంధ్రావాళ్ల ప్రయోజనాల కోసమే జగన్ పోరాడుతున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ పరిణామాలు నచ్చకే తాను తెరాసలో చేరుతున్నట్లు ఖమ్మం వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

05/02/2016 - 16:53

ఖమ్మం: తెలంగాణ ప్రజల కోసం అంకితమైన తెరాస పార్టీలో చేరాలని ఖమ్మం వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. ఆయన సోమవారం మధ్యాహ్నం పొంగులేటి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. రాజకీయ అస్థిత్వం కోసం తెరాసలో చేరడం మంచిదని ఆయన పొంగులేటికి సలహా ఇచ్చారు. ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తెరాసలో చేరితే ఇక తెలంగాణలో వైకాపా అదృశ్యమైనట్లేనని కెటిఆర్ అన్నారు.

Pages