S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 21:41

* బాగోలేదు జీలకర్ర... బెల్లం

తారాగణం:
అభిజీత్, రేష్మ, రఘుబాబు, తదితరులు.
సంగీతం:
వందేమాతరం శ్రీనివాస్
నిర్మాతలు:
ఎ శోభారాణి, ఆళ్ళ నౌరోజీరెడ్డి
రచన, దర్శకత్వం:
విజయ్ శ్రీనివాస్
--

05/02/2016 - 21:39

స్క్రీన్ చించేస్తున్న బాలీవుడ్ సెక్స్ బాంబుల గురించి వ్యాసం బావుంది. షకీలా రాకముందే మలయాళ చిత్రాలపై సెక్సీ ముద్ర ఉండేది. నిజానికి ఆ కథలు కాస్త బోల్డ్‌గా ఉండేవి తప్ప శృంగారం మితిమీరేది కాదు. ఆ బోల్డ్‌నెస్‌నే సెక్సీ అనేవారు. ఇప్పుడు పచ్చి శృంగారమే బాలీవుడ్‌ని ముంచెత్తుతోంది. అయితే పబ్బులు, వీడియో పార్లర్లు, లాప్‌టాప్‌లు వచ్చాక యువత అటు మళ్లింది.

05/02/2016 - 21:26

మసక వెనె్నల మగువ రూపం తీసుకున్నట్టుండే -దీక్షాపంత్ చకచకా సినిమాల చేస్తున్నా ఇంకా సరైన బ్రేక్ పడలేదు. పేరు తెచ్చే పెద్ద క్యారెక్టర్ ఒక్కటీ పడకపోవడమే ఇందుక్కారణమంటున్నారు. ఒక లైలా కోసం చిత్రంతో కెరీర్ మొదలెట్టిన దీక్ష -పవన్ కల్యాణ్, వెంకటేష్ కాంబోలో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేసింది. తరువాత నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయినా చిత్రంలోనూ తళుక్కుమంది.

05/02/2016 - 21:21

తనను వరించిందే రంభ..! అన్నాడట వెనుకటికి ఒకడు? అలాంటి పరిస్థితే సినీ అవార్డుల్లోనూ కనిపిస్తుంది. హాలీవుడ్ నుండి దిగుమతి అయిన ‘చెడ్డ అవార్డులు’ యిప్పుడు బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ని సంపాదించుకుంటున్నాయి. ‘గోల్డెన్ కేలా’ పేరిట అందిస్తున్న ఈ అవార్డులను సైతం అందుకోవడానికి పరిశ్రమలోనివారు సిద్ధపడడం చూస్తుంటే పేరుకు తగ్గట్టుగానే ‘కోతికి అరటిపండు’ దొరికినట్టు అనిపించకమానదు.

05/02/2016 - 21:20

ఒక కళాకారుడికి చిత్ర విజయాలతోపాటు అవార్డులు మానసిక ఆనందాన్ని కలుగచేస్తూ మరికొన్ని మంచి పాత్రల్లో నటించటానికి ఉపకరిస్తాయి. ఈ కార్యక్రమాలు ప్రభుత్వపరంగా ఏర్పాటైన సందర్భాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నట గాయకుడు కిశోర్‌కుమార్ పేరిట జాతీయ స్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించిన కళాకారులకు ఏటా అవార్డులు ఇచ్చి సత్కరిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం రాజ్‌కపూర్ పేరిట అవార్డులు ప్రవేశపెట్టింది.

05/02/2016 - 21:19

వందేళ్ల సినిమాకు
400 ఏళ్ల బంధమేమిటి?
ఒకటి కాదు.. వంద కాదు.. వెయ్యి సినిమాలకైనా ఇతివృత్తమూలం ఆ పది నాటకాల నుంచే ఉండటమేంటి?

05/02/2016 - 21:17

తమ్మూ ఎంత స్పీడుగా ఎందిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిశ్రమలో అడుగుపెట్టిన కాలం నుంచి టాప్ రేంజ్‌కు వెళ్లడానికి ఆమెకు ఎంతో టైం పట్టలేదు. స్టార్ హీరోలకు సరైన జోడీ అన్న టాలెంటెడ్ టాక్‌తో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తమ్మూ -త్వరలో రామ్‌తో మరోసారి జోడీ కట్టబోతోందట. గతంలో ‘ఎందుకంటే.. ప్రేమంట’ చిత్రంలో పెయిర్‌గా కనిపించారు.

05/02/2016 - 21:12

అవకాశాలు రావాలంటే అందాలైనా ఉండాలి. ఆహార్యాన్ని మరిపించే నటనా పాటవమైనా ఉండాలి. రెండూవున్నవాళ్లు -కష్టం లేకుండా టాప్‌రేంజ్‌కు చేరడం క్లిష్టం కాదు కనుక వాళ్లను పక్కనపెడదాం. కేవలం అందాలనే నమ్ముకుని అవకాశాలు అందుకుంటున్న వాళ్ల లిస్టులో -సోనారికాకు స్పెషల్ ప్లేస్ ఇస్తున్నారు తోటి తారలు. ‘అమ్మో అంత స్పీడ్ మావల్ల కాదు’ అంటూ మూతి తిప్పుకుంటున్నార్ట.

05/02/2016 - 21:08

స్క్రీన్ మీద చూస్తే -సినిమా. వెబ్‌సైట్లో చూస్తే -వెబీమా! ఆశ్చర్యపోతున్నారు కదూ! నిజానికి వెబీమా అన్నది వెబ్ సైట్ సినిమాలు ఎక్కువ చూస్తున్నవాళ్లు పెట్టుకున్న టెక్ వర్డ్.

05/02/2016 - 21:04

-సంజీవ్ మేగోటి

తెలుగు, కన్నడ భాషల మధ్య సినిమా అన్న సరిహద్దుని ఒకటి చేసి, అటు
కన్నడంలోను, ఇటు తెలుగులోను
చిత్రాలను నిర్మిస్తూ సరికొత్త పంధాలో
పయనిస్తున్నారు సంజీవ్ మేగోటి. అఘోర చిత్రంతో తెరంగేట్రం చేసి మనసుందిరా, కలర్స్, పౌరుషం చిత్రాలతో తన సత్తా నిరూపించిన ఆయన కన్నడ చిత్రాల విజయపరంపరతో తెలుగు
పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఈవారం ఆయనతో చిట్‌చాట్..
--

Pages