S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 14:00

గుంటూరు: మంగళగిరి మండంల ఎర్రబాలెంలోని ఓ పరుపుల తయారీ పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం తెలిశాక అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. కోటి రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

04/29/2016 - 13:59

గాంధీనగర్: ఆరులక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మే 1నుంచి అమలులోకి వస్తుందని సిఎం ఆనందీబెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్టల్రో మైనార్టీలకు ఇదివరకే రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేశారు. రిజర్వేషన్ల కోసం ఇటీవల పటేల్ కులస్థులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

04/29/2016 - 13:59

ఖమ్మం: పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత శుక్రవారం నామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆమె ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన భర్త, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాలతో గెలుస్తానని ఆమె అన్నారు.

04/29/2016 - 13:58

దిల్లీ: బొగ్గు గనుల కుంభకోణంలో అప్పటి కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సిఎం మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌తో పాటు మొత్తం 13 మందిపై చార్జిషీట్లు దాఖలు చేయాలని ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

04/29/2016 - 13:57

విశాఖ: నాలుగు రోజులపాటు మంటలు ఎగసిపడిన బయోమ్యాక్స్ రసాయన కర్మాగారాన్ని మూసివేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశించింది. దువ్వాడ సెజ్‌లోని ఈ కర్మాగారంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించాక మంటలు పూర్తిస్థాయిలో తగ్గించేందుకు నాలుగు రోజుల సమయం పట్టింది. ప్రమాదం వల్ల 125 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

04/29/2016 - 12:46

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్ష (నీట్)ను అన్ని రాష్ట్రాలూ విధిగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం శుక్రవారం నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నందున ‘నీట్’ నుంచి కొన్ని రాష్ట్రాలకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం కోరుతోంది. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది.

04/29/2016 - 12:45

విజయవాడ: మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (నీట్)ను అన్ని రాష్ట్రాలూ నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ఎపి ఎంసెట్ శుక్రవారం ఉదయం యథావిధిగా ప్రారంభమైంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉదయం 10 గంటలకు ఎంట్రన్స్ ప్రారంభమైంది. మధ్యాహ్నం మెడిసిన్ ఎంట్రన్స్ జరుగుతుంది. ఎంసెట్ నిర్వహణకు ఏపి ప్రభుత్వం మొత్తం 546 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

04/29/2016 - 12:45

తిరుపతి: ఇక్కడికి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

04/29/2016 - 12:45

గుంటూరు: గుంటూరులో నిర్మించే తొలి ఫైవ్‌స్టార్ హోటల్ ‘మై ఫార్ట్యూన్’కు ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 1.45 ఎకరాల స్థలంలో 12 అంతస్థుల హోటల్ నిర్మాణానికి ఐటిసి సుమారు 150 కోట్లరూపాయలను వెచ్చిస్తుంది. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు పుల్లారావు, రావెల, ఐటిసి ప్రతినిధులు పాల్గొన్నారు.

04/29/2016 - 12:44

ఖమ్మం: కార్యకర్తల కోలాహలం నడుమ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం పాలేరు ఉపఎన్నికలో తెరాస అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు కెటిఆర్, కడియం శ్రీహరి, పార్టీ నేతలు హాజరయ్యారు.

Pages