S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 22:48

స్టార్ హీరోలు కూడా తమ కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నప్పుడు ఒక్కోసారి ఎటువంటి పాత్రలకైనా సిద్ధం కాక తప్పదు. ఈ విషయంలో జగపతిబాబు ముందున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరోగా కూడా విలన్‌గా నటించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి విలన్‌గా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హీరోగా మమ్ముట్టి వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

01/18/2016 - 22:46

సంక్రాంతికి ‘డిక్టేటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే 99 చిత్రాల్లో నటించిన ఆయన తన 100వ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. మొత్తానికి బాలయ్య 100వ సినిమాపై క్లారిటీ వచ్చేసింది?

01/18/2016 - 22:43

రెండేళ్లుగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్ ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12న భారీ స్థాయిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

01/18/2016 - 22:34

ప్రముఖ నటుడు నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ ముఖ్యపాత్రల్లో కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతోంది.

01/18/2016 - 18:55

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, సభ్యుల తీరుపై శాసనసభ విలువల కమిటీ సమగ్రంగా చెర్చించింది. నాలుగు గంటలపాటు జరిగిన ఆ సమావేశంలో పలువురు నాయకులు సూచనలు చేశారు. ఇదే సమయంలో ఆస్తి, అప్పుల వివరాలు అందించిన 40 మంది సభ్యుల జాబితాను వివరాలను విడుదల చేశారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ ముగింపు సందేశమిచ్చారు. అసెంబ్లీ హాలులో జరిగిన సమావేశానికి ఉప సభాపతి బుద్దప్రసాద్ హాజరయ్యారు.

01/18/2016 - 17:28

ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆదివారం సిరా దాడి చేసిన భావన అరోరా అనే ఆమ్‌ ఆద్మీ సేన యువతిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

01/18/2016 - 17:09

తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డిని సోమవారం అరెస్ట్ చేయడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆయనను సోమవారం నెల్లూరు కోర్టుకు తరలించగా... ఈ నెల 29 వరకు చెవిరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ...

01/18/2016 - 17:02

ఫ్రాన్స్‌: దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌ ప్రకటించారు. వ్యాపారవేత్తల్ని ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగంలో అత్యవసర పరిస్థితిపై ఆయన ప్రకటన చేశారు. స్తబ్దుగా ఉన్న ఆర్థికవృద్ధికి వూతమిచ్చేందుకు సంస్కరణలను ప్రతిపాదించారు.

01/18/2016 - 16:48

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంనాడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 267 పాయింట్లునష్టపోయి 24,188 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లునష్టపోయి 7,351 పాయింట్ల వద్ద ముగిసింది.

01/18/2016 - 16:44

హైదరాబాద్ : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సహకరిస్తామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. ఎరువుల కర్మాగారంపై సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ఎరువుల సంస్థ అధికారులు హాజరయ్యారు. 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తామని, ఈ కర్మాగారం పునరుద్ధరణ వల్ల 3వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని వెల్లడించారు.

Pages