S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 13:27

తిరుపతి ‌: నంది నాటకోత్సవాలు తిరుపతిలో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. మహతి కళాక్షేత్రం వేదికగా పదిరోజుల పాటు ఈ నాటకోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు శివప్రసాద్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, రోజా తదితరులు హాజరయ్యారు.

01/18/2016 - 13:23

కర్నూలు : కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లి బస్సు స్టేజి వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

01/18/2016 - 13:10

గుంటూరు: నరసారావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల్లో రహదారుల నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఈ రోజు ఉదయం నరసారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట శ్రీనివాసరెడ్డి ధర్నా చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

01/18/2016 - 13:07

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడే ఉందని, రానున్న రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు కొత్త ఆవిష్కరణలకు హబ్‌గా తయారవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

01/18/2016 - 13:03

హైదరాబాద్‌: తెలుగువారికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన కుమార్తె, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కారంచేడులోని చిన్న వంతెన కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఈరోజు ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.

01/18/2016 - 13:01

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హచ్‌సీయూ)లో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపారు. ఆస్పత్రి దగ్గరకు వచ్చిన దళిత నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

01/18/2016 - 12:53

హైదరాబాద్‌: ‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని ఎన్టీఆర్‌ అభిమానులకు ఆయన తనయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

01/18/2016 - 12:46

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి చెన్నైలోని సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి రాకతో కోర్టు ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసి పోయింది.

01/18/2016 - 12:44

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామారావు పార్టీకి, దేశానికి సేవలు మరువలేనివని కొనియాడారు.

01/18/2016 - 13:22

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నటుడు, నందమూరి బాలకృష్ణ ఈ ఉదయం సమావేశమయ్యారు. క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన నిర్మాణాలను బీఆర్‌ఎస్ కింద క్రమబద్దీకరించాలని సీఎంను బాలయ్య కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న క్యాన్సర్ ఆస్పత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తదని సీఎం తెలిపారు.

Pages