S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2016 - 06:30

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
ఆకాశాన్నంటాయ. ముంగిళ్లలో గొబ్బెమ్మలు,
హరిదాసులు, గంగిరెద్దు దాసరిలతో పర్వదినానికి
మరింత శోభ చేకూరింది. సంప్రదాయం, సంస్కృతి మేలుకలయకగా ప్రతి ఇంట వెలుగుపూలే పూశాయ.
...................................
సంక్రాంతి సందర్భంగా పాఠకులకు,
ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు
మేలు తలపులు.

01/15/2016 - 06:27

ఏలూరు, అమలాపురం, జనవరి 14: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఉభయ గోదావరి జిల్లాల్లో గురువారం నుండి కోడి పందాలకు తెరలేచింది. అలా, ఇలాకాదు... గ్రామ గ్రామాన కోడి పందాలతోపాటు పేకాట, గుండాట విచ్చలవిడిగా నిర్వహించారు. ‘మూడు రోజుల పాటు మీ జోలికి ఎవరూ రారు’ అంటూ నేతలిచ్చిన అభయహస్తం మాటున ఈ వ్యవహారం సాగిపోతోంది. ఉదయం 10 గంటల వరకు పోలీసులు హడావుడిచేసినా, ఆ తర్వాత పైనుండి వచ్చిన ఆదేశాలతో చేతులెత్తేశారు.

01/15/2016 - 06:30

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన జైషే మహమ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్ అరెస్టును పాకిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించకపోవటంతో శుక్రవారం జరగవలసిన రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం రద్దు అయ్యింది. విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశాన్ని పరస్పర అంగీకారంతో వాయిదా వేసుకున్నట్లు రెండు దేశాల అధికార ప్రతినిధులు గురువారం ప్రకటించారు.

01/15/2016 - 06:22

తిరుపతి, జనవరి 14 : ఆంధ్రరాష్ట్రం వచ్చే సంక్రాంతి నాటికి అన్ని రంగాల్లో పరిపూర్ణమైన అభివృద్ధి సాధించాలని తాను కాంక్షిస్తున్నానని అభివృద్ధికి రాష్ట్రం చిరునామా కానున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం విజయవాడనుంచి రేణిగుంటకు విమానంలో చేరుకున్నారు.

01/15/2016 - 06:19

హైదరాబాద్, జనవరి 14: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందంటూ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రతి రోజూ చెబుతున్నా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయించిన కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

01/15/2016 - 06:17

హైదరాబాద్, జనవరి 14: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ వాహన యాజమానులకు ఉపశమనం కలిగించే విధంగా రెండు రాష్ట్రప్రభుత్వాలు త్వరలో ఎంట్రీ ట్యాక్స్‌ను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోనున్నాయి. ఈ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల రవాణా శాఖ కమిషనర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

01/15/2016 - 06:16

తిరుమల, జనవరి 14: మూడు వందల రూపాయలు చెల్లించి, ప్రత్యేక దర్శనంలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త! ఇందుకోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తుడికి శుక్రవారం నుండి సంక్రాంతి కానుకగా అదనంగా రెండు లడ్డూలను విక్రయించాలని ఈవో సాంబశివరావు నిర్ణయించారు. ప్రస్తుతం ఆరుగురు కుటుంబ సభ్యులు కలిగిన భక్తులు 300 రూపాయల టిక్కెట్లు కొంటే వారికి ఉచితంగా 12 లడ్డూలను టిటిడి అందిస్తోంది.

01/15/2016 - 06:15

హైదరాబాద్, జనవరి 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు మార్గంతో అనుసంధానం చేసే ప్రతిపాదనను రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారు. ఈ మేరకు అవసరమైన నివేదిక తయారు చేసి కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పంపింది. సర్వే పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని రైల్వే బోర్డు సమాచారం పంపినట్లు తెలిసింది.

01/15/2016 - 05:38

తారాగణం:
ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఆశిష్ విద్యార్థి, మధుబాల తదితరులు
సంగీతం:
దేశీశ్రీ ప్రసాద్
నిర్మాత:
బివిఎస్‌ఎన్ ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సుకుమార్

01/15/2016 - 05:19

బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన మాతృత్వ మధురిమలతో తడిమి ఈ లోకాన్ని పరిచయం చేసేది అమ్మ. అమ్మకన్నా గొప్ప దైవం ఎక్కడా ఉండదు. అమ్మ లేకపోతే ఆ లోటు జీవితంలో ఎవరూ తీర్చలేరు. తన బదులుగా దేవుడు అమ్మను ఇచ్చాడని, కొంతమంది కవులు చెబుతారు. మాతృదేవోభవ అని ముందుగా అమ్మనే స్మరిస్తాం. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మ గూర్చి తెలిపే సినిమాలు తెలుగు పరిశ్రమలో చాలా తక్కువే ఉన్నాయి.

Pages