S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/22/2015 - 04:36

అంతర్గతంగా మన ప్రభుత్వాలు, క్రీస్తుశకం 1994 నుంచి, సంపన్న దేశాల ప్రయోజనాలను పెంపొందించడానికి వీలైన ఆర్థిక నీతిని అవలంబిస్తున్నాయి. సంపన్న దేశాల ఆర్థిక దురాక్రమణను అంతర్జాతీయ వేదికలపై నిరోధించడానికి మన ప్రభుత్వాలు యత్నిస్తుండడం సమాంతర పరిణామం. ఈ రెండు సమాంతర ప్రక్రియలు పరస్పరం వైరుధ్యాలుగా కొనసాగుతుండడం ఇటీవల ముగిసిన ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సులో మన వైఫల్యానికి నేపథ్యం.

12/21/2015 - 18:48

హైదరాబాద్‌: ఫిఫా అధ్యక్షుడు సీప్‌ బ్లాటర్‌, ఉపాధ్యక్షుడు మిచెల్‌ ప్లాటినీలను ఎనిమిదేళ్లపాటు ఫుట్‌బాల్‌ సంబంధిత ఏ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫిఫా ఎథిక్స్‌ కమిటీ నిషేధించింది. లంచం, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారించి ఈ తీర్పును వెలువరించింది.

12/21/2015 - 18:47

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 45వేలకు పైగా గృహాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని ఇళ్లను కేంద్రం మంజూరు చేయటం విశేషం. గతంలో రాష్ట్రానికి 10వేల ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

12/21/2015 - 18:44

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.

12/21/2015 - 18:36

గువహటి: అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. గత నెలలో బీజేపీలోకి చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగోయ్ అనర్హులుగా ప్రకటించారు.126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్కు 69 ఎమ్మెల్యేలున్నారు.

12/21/2015 - 16:49

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చంద్రబాబు వారితో చర్చించారు.

12/21/2015 - 16:48

చెన్నై: రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నదమ్ములు ఒకేసారి మరణించిన విషాద సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కావేరి పట్టణానికి చెందిన ఈ నలుగురు అన్నదమ్ములు పండ్ల వ్యాపారస్థులు. వీరంతా ఆటోలో వెళ్తుండగా ఆటో టైరు పేలి రోడ్డు పక్కన గొయ్యిలో పడడంతో ప్రమాదం జరిగింది.

12/21/2015 - 16:46

ముంబయి : సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 216 పాయింట్లు లాభపడి 25,735 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 7,834 పాయింట్ల వద్ద ముగిసింది.

12/21/2015 - 16:45

హైదరాబాద్ : మంత్రులు కేటీఆర్, తలసాని సమక్షంలో కేఎం ప్రతాప్, కట్టెల శ్రీనివాస్, వీఎన్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరారు.

12/21/2015 - 16:44

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వాకౌట్ చేసింది పుట్టినరోజు జురుపుకొనేందుకా అని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. సభ నుండి రోజా సంతోషంగానే వెళ్లిపోయారని, రాజధాని ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Pages