S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 16:43

హైదరాబాద్ : గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే గెస్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాల అధ్యాపకుల వేతనం రూ. 8,500, టీజీటీ, పీజీటీ, పీడీ విభాగాల అధ్యాపకుల వేతనం రూ. 7,500, పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ విభాగాల అధ్యాపకుల వేతనం రూ. 6,500, మ్యూజిక్ విభాగం అధ్యాపకుల వేతనం రూ. 6,500కు పెంచడం జరిగింది.

12/21/2015 - 16:42

అనంతపురం: కాల్‌మనీ వ్యాపారానికి ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి అన్నారు.

12/21/2015 - 14:28

హైదరాబాద్‌: అగ్రిగోల్‌ కేసు దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అరెస్టులు ఎందుకు చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. సీఐడీ దర్యాప్తుపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే దర్యాప్తు అధికారిని తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే తీరు కొనసాగితే తాము ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.

12/21/2015 - 14:11

జయదేవ్‌పూర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించతలపెట్టిన ఆయుత మహా చండీయాగం కార్యక్రమాలకు సోమవారం అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా యాగశాలల్లోకి వెళ్లిన కేసీఆర్‌ దంపతులు గురుప్రార్ధన, గణపతిపూజ, పుణ్యవచనం, దేవానంది, అంకురార్పణం, పంచగమ్య మేననం, గోపూజ, యాగశాల ప్రవేశం, సంస్కారం, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

12/21/2015 - 14:09

ఢిల్లీ : ఢిల్లీలో నానాటికీ అధికమవుతున్న పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీల కోసం కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటుచేసింది. ఈ బస్సులను పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

12/21/2015 - 14:08

ఢిల్లీ : నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ ఘటనలో బాల నేరస్థుడు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.

12/21/2015 - 14:00

ఇండోనేషియా: ఇండోనేషియాలో సోమవారం భూకంపం సంభవించింది. బోర్నియో ద్వీపంలోని కలిమంటన్‌ ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు.

12/21/2015 - 13:55

తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చేస్తున్నారు. 24 గంటల ముందే భక్తులను క్యూలోకి అనుమతించిన టీటీడీ అన్ని మౌలిక వసతులు కల్పించింది. ఈరోజు స్వామివారిని రికార్టుస్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

12/21/2015 - 13:51

న్యూఢిల్లీ : ఢిల్లీ క్రికెట్ సంఘంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అరోపణలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ లోకసభలో వివరణ ఇచ్చారు. క్రికెట్ స్టేడియంలో వీఐపీ బాక్సుల నిర్మాణం ద్వారా 35 కోట్లు సేకరించినట్లు మంత్రి తెలిపారు. 114 కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో పునర్నిర్మాణం చేపట్టినట్లు జైట్లీ సభలో పేర్కొన్నారు.

12/21/2015 - 11:56

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు సోదాలు చేసి ఇద్దరు ప్రయాణీకుల నుంచి దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణీకుడు శరీర భాగంలో 950 గ్రాముల బంగారాన్ని దాచి తెస్తున్నట్లు స్కానింగ్‌లో కనుగొన్నారు. మరో ప్రయాణీకుడి లగేజీని తనిఖీ చేయగా సుమారు

Pages