S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 11:55

దిల్లీ: దిల్లీ క్రికెట్ సంఘంలో తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యులపైనా అర్థంలేని ఆరోపణలు చేయటం తగదని జైట్లీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

12/21/2015 - 11:55

మెదక్: తెలంగాణ సి.ఎం కెసిఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ వద్ద సోమవారం ఉదయం తన సతీమణితో కలిసి గణపతి యాగం నిర్వహించారు. బుధవారం నుంచి అయుత చండీయాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో గణపతి యాగం జరిపారు. చండీయాగానికి పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్టప్రతి హాజరు కానున్న నేపథ్యంలో సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి.

12/21/2015 - 11:54

హైదరాబాద్: ఎ.పి. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైకాపా నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి బయటకు వెళ్లిపోయిన తరువాత వైకాపా ఎమ్మెల్యేలు ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే అంశంపై రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

12/21/2015 - 11:54

హైదరాబాద్: సరూర్‌నగర్ వద్ద సూర్యానగర్ కాలనీలో సోమవారం ఉదయం రోడ్డుపై నడచిన వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు గొలుసు తెంపుకొని పారిపోయాడు. దీంతో అదుపుతప్పి మహిళ కింద పడిపోవడంతో ఆమె తలకు గాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

12/21/2015 - 11:53

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో ఊరేగిస్తుండగా భక్తుల రద్దీ అధికమై స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప మెట్లపై ఎక్కిన భక్తులు కిందికి జారి పడ్డారు. దీంతో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

12/21/2015 - 11:53

తిరుపతి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఎ.పి.లోని తిరుమల, ఒంటిమిట్ట, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, తెలంగాణలో యాదాద్రి, భద్రచలం, వేములవాడ తదితర ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. తిరుమలలో స్వామివారు ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

12/21/2015 - 11:52

విశాఖ: జి.మాడుగుల మండలం మడవకొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి, ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడన్న అభియోగంపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.

12/21/2015 - 11:52

హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయక పోవడం, కాల్‌మనీ వ్యవహారంపై చర్చ చేపట్టక పోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శీతాకాల సమావేశాలకు తాము హాజరయ్యే ప్రసక్తి లేదని విపక్ష నాయకులు వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు.

12/21/2015 - 08:02

హైదరాబాద్, డిసెంబర్ 20:క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అధికారికంగా ఆదివారం సాయంత్రం నిజాం కాలేజిలో క్రైస్తవ ప్రముఖులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావువిందు ఇచ్చా రు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు హాజరైన చిన్నారులకు గిఫ్ట్‌లు అందజేశారు.

12/21/2015 - 08:01

హైదరాబాద్, డిసెంబర్ 20: పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Pages