S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 08:00

విజయవాడ (క్రైం), డిసెంబర్ 28: తాను ఓ బాధితురాలినే తప్ప నిందితురాలిని మాత్రం కాదని, పోలీసులు తనపై ఎందుకు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారో తెలియడం లేదని సినీనటి తారాచౌదరి అలియాస్ రాజేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం నేరం చేశానని విజయవాడ పోలీసులు తనపై రౌడీషీటు, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అదే నిజమైతే తాను న్యాయపోరాటం చేస్తానంటూ ప్రకటించారు.

12/21/2015 - 07:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పార్లమెంటు భవనాన్ని సందర్శించే వారు మీడియాతో మాట్లాడవద్దని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ‘మీడియాతో మాట్లాడవద్దని సందర్శకులను కోరుతున్నాం’ అని లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసే జనరల్ పాస్‌లపై ఎర్ర అక్షరాలతో రాసి ఉంటోంది. అలాగే మొబైల్ ఫోన్లు, కెమెరాలు, తుపాకులులాంటి మారణాయుధాలను కూడా పార్లమెంటు భవనంలోపలికి తీసుకు రావద్దని సందర్శకులకు సూచించారు.

12/21/2015 - 07:59

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కల్వకుంట్ల రాజ్యాంగం అమలులో ఉందని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

12/21/2015 - 07:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: డిడిసిఎ వ్యవహారానికి సంబంధించి తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై పరువు నష్టం దావావేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నారు. వీరిపై ఢిల్లీ హైకోర్టులోనూ, పాటియాలా హౌజ్ కోర్టుల్లోనూ సోమవారం క్రిమినల్, పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని తన న్యాయవాదుల బృందాన్ని కోరారు.

12/21/2015 - 07:53

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణలో త్వరలో జరిగే పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపును ఇస్తున్నట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. ఆదివారం ఆయన తన ఇద్దరు కుమారులతో హైదరాబాద్ నుంచి తాండూర్‌కు సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తన స్నేహితులను కలుసుకున్నారు.

12/21/2015 - 07:52

విజయవాడ, డిసెంబర్ 20: విజయవాడ కేంద్రంగా రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారాన్ని ఏఒక్కరూ కూడా రాజకీయ కోణంలో చూడరాదని బిజెపి మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జ్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. వడ్డీ సొమ్ము బకాయిదారులపై లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడిన వారందరిపై నిర్భయ చట్టం కింద తక్షణం కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

12/21/2015 - 07:51

హైదరాబాద్, డిసెంబర్ 20: శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభా మర్యాదను ఏమాత్రం పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సభలో ఆయన వ్యవహారశైలి సక్రమంగా లేదని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

12/21/2015 - 07:50

కాకినాడ, డిసెంబర్ 20: కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియను డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గడువులోగా సెట్‌ఆప్ బాక్స్‌లను ఏర్పాటుచేసుకోని పక్షంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేయాలని స్పష్టం చేసింది.

12/21/2015 - 07:49

తిరుమల, డిసెంబర్ 20: తిరుమల జెఇఓ కార్యాలయానికి దారి ఎటు అని అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయిన చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఎస్‌ఐ నాగేశ్వరరావు విజయవాడకు చెందిన ఫణికుమార్‌పై సర్వీస్ రివాల్వర్‌ను గురిపెట్టిన సంఘటన ఆదివారం ఎస్‌ఎంసి సర్కిల్‌లో చోటుచేసుకొంది. దీంతో ఆగ్రహించిన భక్తులు ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా మరికొంతమంది భక్తులు చేరి పోలీసులను నిలదీశారు.

12/21/2015 - 07:43

యొకహమా, డిసెంబర్ 20: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ఆధ్వర్యంలో జరిగిన క్లబ్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను స్పెయిన్ దిగ్గజం బార్సిలోనా కైవసం చేసుకుంది. ఆదివారం భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 3-0 తేడాతో అట్లెటికో రివర్ ప్లేట్‌ను చిత్తుచేసింది. సౌరెజ్ రెండు గోల్స్ సాధించి, బార్సిలోనాను విజయపథంలో నడిపాడు. మెస్సీ ఒక గోల్ చేశాడు.

Pages