S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 07:41

ఫటోర్డా, డిసెంబర్ 20: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను చెనె్నయిన్ క్లబ్ కైవసం చేసుకుంది. ఆదివారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెనె్నయిన్‌ను అదృష్టం వరించగా, గోవాను దురదృష్టం లక్ష్మీకాంత్ కట్టిమణి రూపంలో వెంటాడింది. మెన్డోజా వలెన్షియా మ్యాచ్ చివరి క్షణాల్లో కీలక గోల్ చేసి చెనె్నయిన్‌ను గెలిపించాడు.

12/21/2015 - 07:40

హామిల్టన్, డిసెంబర్ 20: శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నది. నిన్నటి వరకూ శ్రీలంకది పైచేయికాగా, మ్యాచ్ మూడోరోజు, ఆదివారం టిమ్ సౌథీ విజృంభణతో కివీస్ ఆధిపత్యాన్ని సంపాదించింది. విజయం దిశగా అడుగులు వేస్తున్నది.

12/21/2015 - 07:40

కోల్‌కతా, డిసెంబర్ 20: మళ్లీ ఫామ్‌లోకి వస్తానని, గతంలో మాదిరిగానే ఉత్తమ ఆటతో రాణిస్తానని ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టి-20 జట్టులో స్థానం సంపాదించుకున్న యువరాజ్ సింగ్ చెప్పాడు. కోల్‌కతా 25కె రన్‌కు హాజరైన అతను విలేఖరులతో మాట్లాడుతూ, చాలకాలంగా తాను చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పాడు.

12/21/2015 - 07:39

కోల్‌కతా, డిసెంబర్ 20: టాటా స్టుల్ కోల్‌కతా 25కె రన్ మహిళల విభాగంలో సుధా సింగ్ టైటిల్ కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది రియో డి జెనీరియోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఆమె ఈ రన్‌ను ప్రాక్టీస్ ఈవెంట్‌గా పూర్తి చేసింది. లక్ష్యాన్ని ఒక గంట, 27.31 నిమిషాల్లో చేరుకున్న సుధ విజేతగా నిలవగా, చివరి క్షణం వరకూ ఆమెకు గట్టిపోటీనిచ్చిన లలితా బాబర్ ఒక గంట, 27.47 నిమిషాలతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.

12/21/2015 - 07:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం తొలి నాలుగు రోజులు (సోమ-గురు) లాభాలను అందుకున్న స్టాక్ మార్కెట్లు.. వరుస రెండు వారాల నష్టాలకు అడ్డుకట్ట వేశాయి.

12/21/2015 - 07:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోలేక వెనుకబడిన ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. వినియోగదారులను పెంచుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇందులోభాగంగానే కొత్తగా బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకి తొలి రెండు నెలలపాటు కాల్ చార్జీలను 80 శాతం వరకు తగ్గించింది.

12/21/2015 - 07:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) కొత్తగా కోటి మందిని ఆదాయపు పన్ను (ఐటి) చెల్లించే వారి జాబితాలో చేర్చాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 27 లక్షలకుపైగా మందిని ఈ జాబితాలోకి తీసుకువచ్చింది.

12/21/2015 - 07:31

పరకాల, డిసెంబర్ 20: విద్యుదు త్పత్తికి కెటిపిపి రెండో దశ 600 మెగావాట్ల కేంద్రం సిద్ధమైంది. ట్రయల్న్ విజయవంతం కావడంతో వాణిజ్య ఉత్పత్తిని చేపట్టి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించేందుకు జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. రెండో దశ 600 మెగావాట్ల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడిపించి విజయవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు ఆగకుండా ప్రాజెక్ట్ నడిపించామన్నారు.

12/21/2015 - 07:30

వరంగల్, డిసెంబర్ 20: వరంగల్ జిల్లా మడికొండ పరిధిలోగల కాకతీయ సొసైటీకి కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికిగాను వౌలిక వసతుల కల్పన కోసం 161 ఎకరాల భూమిని కేటాయంచినది తెలిసిందే. మొదటి దశలో 364 మంది చేనేత కార్మికులకు పవర్‌లూమ్స్ ఏర్పాటుకు వీలుగా రూ. 10 కోట్ల నిధులను కూడా కేటాయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

12/21/2015 - 07:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారతీయ ఆర్థిక వ్యవస్థపై విదేశీ మదుపరులకు భయాలు పెరుగుతున్నాయ. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) దిగులు పట్టుకుంది. దేశీయ మార్కెట్లలో నెలనెలా వారి పెట్టుబడులు అంతకంతకూ పడిపోతుండటమే దీనికి నిదర్శనం. స్టాక్ మార్కెట్లలో గత వారం విదేశీ మదుపరులు మళ్లీ పెట్టుబడుల దిశగా నడిచినప్పటికీ స్వల్ప పెట్టుబడులతోనే సరిపెట్టారు.

Pages