S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 03:58

న్యూఢిల్లీ, నవంబర్ 20: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో భారత ఆటగాళ్లలో ఆకాశ్‌దీప్ సింగ్‌కు అత్యధికంగా 55 లక్షల రూపాయలు లభించాయి. మొత్తం మీద ఈ వేలంలో జర్మనీకి చెందిన మోరిజ్ ఫ్యూసే అత్యధిక ధరతో కొత్త రికార్డు నెలకొల్పాడు. హెచ్‌ఐఎల్ చరిత్రలో లక్ష డాలర్లు పలికిన తొలి ఆటగాడిగా సంచలనం సృష్టించాడు.

11/21/2015 - 03:58

ముంబయి, నవంబర్ 20: ఫిలాండర్, డేల్ స్టెయిన్ గాయాల కారణంగా బలహీనపడిన తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ మర్చెంట్ డి లాంగేను భారత్‌తో జరిగే మిగతా రెండు టెస్టులకోసం పిలిపించింది.

11/21/2015 - 03:57

హైదరాబాద్, నవంబర్ 20: మిక్స్‌డ్ డబుల్స్ స్టార్ జట్లయిన లియాండర్ పేస్-మార్టినా నవ్రతిలోవా, మహేష్ భూపతి-సానియా మీర్జా మధ్య మూడు మ్యాచ్‌ల ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌లో రెండవ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఎస్‌ఎంటిఎ (సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ)లో వచ్చే గురువారం జరుగుతుంది. గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ రెండేసి టైటిళ్లు సాధించాయి.

11/21/2015 - 03:56

చండీగఢ్, నవంబర్ 20: సమీప భవిష్యత్తులోనే తాను తిరిగి భారత జట్టులోకి వస్తానన్న విశ్వాసాన్ని స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం వ్యక్తం చేసాడు. ఇటీవలి వన్‌డేలలో తాను బాగానే రాణించానని అతను చెప్తూ, మళ్లీ టెస్టు మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నానని తెలిపాడు. ఆడేటప్పుడు దూకుడుగా ఉండడం గురించి అడగ్గా, దూకుడుగా ఉండడం అనేది సవాలును ఎలా ఎదుర్కోవానే దానికి సంబంధించినదిగా ఉండాలి.

11/21/2015 - 03:56

హైదరాబాద్, నవంబర్ 20: ఈ ఏడాదికన్నా మెరుగైన ఏడాది తన కెరీర్‌లో ఉండడం చాలా కష్టమని, అయితే ఈ సీజన్‌లో సాధించిన విజయాలతో సరితూగేలా ఉండడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటోంది. 2015 సీజన్‌లో మార్టినా హింగిస్ జోడీగా సానియా డబుల్స్‌లో రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలుచుకోవడమే కాకుండా డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ జోడీ అయిన విషయం తెలిసిందే.

11/21/2015 - 03:55

కాన్పూర్, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్, వడోదర జట్ల మధ్య కాన్పూర్‌లో జరగాల్సిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను గ్రేటర్ నోయిడాకు మార్చారు. కాన్పూర్‌లో ఆటగాళ్ల వసతికి కొరత ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కావలసి ఉంది.

11/21/2015 - 03:54

లండన్, నవంబర్ 20: లండన్‌లో జరుగుతున్న ఎటిపి వరల్ డ టూర్ ఫైనల్స్‌లో సెర్బియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన మూడో సీడ్ ఆటగాడు రోజర్ ఫెదరర్, స్పెయన్ ‘బుల్’ రాఫెల్ నాదల్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

11/21/2015 - 03:53

హర్ఘడా (ఈజిప్టు), నవంబర్ 20: ఈజిప్టులోని హర్ఘడాలో జరుగుతున్న ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. దీంతో భారత్‌కు ఈ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయమైంది. ప్రస్తుతం ఈ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో బరిలో నిలిచిన భారత ఆటగాడు అద్వానీ ఒక్కడే.

11/21/2015 - 02:35

కోహెడ, నవంబర్ 20: హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యం కల్పించేందుకుగాను చేపట్టిన గౌరవెల్లి-గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1200కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో పెద్ద వాగుపై రూ.11.15కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం కం బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు.

11/21/2015 - 02:34

హైదరాబాద్, నవంబర్ 20: రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన వరంగల్ ఉప ఎన్నిక సంరంభం ఆరంభమైంది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో గెలుపుపైకన్నా ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది? విజేత మెజారిటీ ఎంత? అనే అంశాలపైనే ఉత్కంఠత నెలకొంది. గత ఎన్నికల్లో 76.15శాతం పోలింగ్ జరిగింది. 2009లో 69.22శాతం పోలింగ్ నమోదైంది.

Pages