S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/11/2019 - 01:09

హైదరాబాద్, జూలై 10: ఎమ్మెల్సీల సభ్యత్వంపై అనర్హత వేటుకు సంబంధించి ఎస్ రాములు నాయక్, యాదవరెడ్డిలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని, అది చట్టబద్ధమేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

07/11/2019 - 03:31

న్యూఢిల్లీ : కర్నాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు. తమ రాజీనామాలు ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

07/10/2019 - 22:31

కోల్‌కత్తా, జూలై 10: రోజ్ వ్యాలీ పోన్జి కుంభకోణంలో బెంగాలీ సినీ నటి రీతుపర్ణా సేన్‌గుప్తాకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. కోట్లాది రూపాయల రోజ్ వ్యాలీ కుంభకోణానికి సంబంధించి నటుడు ప్రొసెన్‌జిత్ ఛటర్జీని ఈ నెల 19న తమ ముందు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపించినట్లు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి తెలిపారు.

07/10/2019 - 22:30

మంగుళూరు, జూలై 10: దళిత బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి గర్భవతిని చేసిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని విఠల్ ప్రాంతంలో చోటు చేసుకొంది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత డిసెంబర్ నెలలో ఐదుగురు యువకులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టగా ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అని తేలినట్లు పోలీసులు తెలిపారు.

07/10/2019 - 03:57

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దేశం విడిచి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. అయితే, రుణదాతలకు చెల్లించాల్సిన 18,000 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాతే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.

07/10/2019 - 02:57

చర్ల, జూలై 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తకొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న నల్లూరి శ్రీనివాసరావు సోమవారం రాత్రి 10గంటల సమయంలో తన ఇంట్లో నిద్రిస్తుండగా సుమారు 20మంది వరకు మావోయిస్టులు ఇంట్లోకి చొరబడ్డారు.

07/10/2019 - 01:52

న్యూఢిల్లీ, జూలై 9: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఒరిజినల్ సూట్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. గోదావరి జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పోలవరం నిర్మాణం చేపడుతున్నారని.. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేవని..

07/10/2019 - 01:46

అహ్మదాబాద్, జూలై 9: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీపై మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా గుజరాత్ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 9న స్వయంగా హాజరు కావాలని గుజరాత్ కోర్టు ఆదేశిస్తూ తిరిగి కొత్తగా సమన్లు జారీ చేసింది.

07/10/2019 - 01:41

జీడిమెట్ల, జూలై 9: ప్రముఖ కంపెనీ బ్రాండ్‌ను ఉపయోగించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన రాజురామ్ (36), హరీష్ శర్మ (21), శశి శర్మ (23) ఓల్డ్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ముగ్గురు కలిసి వీఆర్‌ఎల్ మార్కెటింగ్ నిర్వహిస్తున్నారు.

07/10/2019 - 01:15

హైదరాబాద్ : టీవీ 9 యాజమాన్య మార్పిడి సమయంలో ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు దాఖలు చేసిన కేసులో మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. అదే విధంగా టీవీ -9కు సంబంధించి సినీ నటుడు శివాజీపై పోలీసుల కేసులోనూ విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది.

Pages