S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/12/2019 - 01:57

జీడిమెట్ల, జూలై 11: సెల్ఫీ, టిక్‌టాక్ వీడియో సరదాలకు ఓ యువకుడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సరాదాగా చెరువులో స్నానానికని వెళ్లిన ఇద్దరు యువకులు.. సెల్ఫీ, టిక్‌టాక్ వీడియోలను తీస్తూ చెరువులోనే మునిగి ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

07/12/2019 - 01:54

ఘట్‌కేసర్, జూలై 11: జల్సాలకు అలవాటు దారిదోపిడీలు చేస్తున్న ముఠా గ్యాంగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి అవుషాపూర్ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుఝామున ముఠా సభ్యులు ఓ లారీకి కారు అడ్డంగా పెట్టి లారీ డ్రైవర్‌ను కొట్టి దోపిడీ పాల్పడినట్లు తెలిపారు.

07/12/2019 - 01:40

హైదరాబాద్: మీడియా చానల్ టీవీ 9 కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గరుడ పురాణం శివాజీ గురువారం సైబరాబాద్ పోలీసుల విచారణకు డుమ్మాకొట్టారు. ఈనెల 11న విచారణకు రమ్మని నటుడు

07/12/2019 - 01:39

హైదరాబాద్: ఎర్రమంజిల్ భవనాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకున్నందున దానిని ప్రభుత్వ భవనంగా ఎందుకు పరిగణించరాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన డివిజన్ బెంచ్ కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చడం సరికాదని దాఖలైన వేర్వేరు పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.

07/12/2019 - 01:24

హైదరాబాద్/ షాద్‌నగర్, జులై 11 లంచాలు లేని రెవెన్యూ అని సీఎం కేసీఆర్ ప్రకటించిన సమయంలోనే ఏకంగా 93లక్షల రూపాయలనోట్ల కట్టలతో దొరికిపోయిన కేశంపేట తహశీల్దార్ లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించిన రోజునే ఒక తహశీల్దార్, వీఆర్‌ఓను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం, కళ్లుచెదిరిపోయే ఆస్తులు కనుగొనడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది.

07/11/2019 - 04:01

హైదరాబాద్, జూలై 10: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుకు సంబంధించి కేంద్రం మరో మారు సమీక్షించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సరిగా లేవని పేర్కొంటూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది.

07/11/2019 - 03:43

నోయిడా (యూపీ), జూలై 10: గ్రేటర్ నోయిడాలో 60 మంది విదేశీయులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది కాలం చెల్లిన వీసాలు కలిగి ఉన్నారని, గౌతమ్ బుద్ధనగర్ సీనియర్ పోలీస్ సూపరింటెండ్ వైభవ్ కృష్ణ పీటీఐకి తెలిపారు. కొంతమంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వచ్చారని అన్నారు.

07/11/2019 - 03:43

న్యూఢిల్లీ, జూలై 10: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగు నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగలించిన బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ నరేష్ కుమార్ దొంగలించి, చివరకు పట్టుబడ్డాడు. ఓ మహిళా ప్రయాణికురాలు తన భర్తతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్నారు. చెకింగ్ పాయింట్ వద్ద తన బ్యాగు అందచేసి, చెకింగ్ తర్వాత తీసుకున్నారు.

07/11/2019 - 03:41

షాద్‌నగర్/కొందుర్గు, జూలై 10: నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ వీఆర్‌వో పట్టుబడగా, కేశంపేట తహశీల్దార్‌ను కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. వ్యవసాయ పొలం ఆన్‌లైన్ చేసేందుకు సదరు వీఆర్‌ఓ అంతయ్యతో పాటు మండల తహశీల్దార్‌లు.. రూ.8లక్షలు డిమాండ్ చేసి, రూ.4లక్షలు రైతు మామిడిపల్లి భాస్కర్ నుంచి వీఆర్‌వో తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

07/11/2019 - 02:01

ఎ కొండూరు, జూలై 10: ఆస్తి తగాదాలో ఒక వ్యక్తి నుండి 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వైనం ఇది. ఏసీబీ డీఎస్‌పీ కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన ఎ కొండూరు గ్రామానికి చెందిన మునగా ఉమామహేశ్వరరావు అతని అన్నదమ్ములు మునగా జగన్నాధం, వెంకటభాస్కరరావుల మధ్య ఆస్తి తగదా ఉంది. ఈవిషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

Pages