S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/07/2019 - 01:50

ఖైరతాబాద్, జూలై 6: వృద్దురాలిని నమ్మించి మోసం చేసిన అడ్వెకేట్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కథనం ప్రకారం.. అమీర్‌పేట నిరజ్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని పద్మావతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే 75 ఏళ్ల శ్యామల అలియాస్ కామేశ్వరి గత రెండేళ్ల క్రితం న్యాయవాదిని కలిసేందుకు నాంపల్లికి వెళ్లింది. ఆ సమయంలో సదరు న్యాయవాది కార్యాలయం మూసి ఉండటంతో వెనుతిరిగింది.

07/07/2019 - 01:41

కీసర, జూలై 6: ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీహెచ్‌ఎంసీ కార్మికుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగారం మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామంలో నివాసముంటున్న డీవీ నాగరాజు (34) జీహెచ్‌ఎంసీలో ప్రేవేట్ లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

07/07/2019 - 01:07

ఖమ్మం, జూలై 6: చత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. ధంతరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) బలగాలు రెండ్రోజులుగా మావోల కోసం గాలిస్తున్నాయి.

07/06/2019 - 23:38

చండూర్, జూలై 6: నల్లగొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో శనివారం అప్పుల బాధతో గండూరి నరసింహ(49) ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రైతు నరసింహ తనకున్న నాలుగున్నర ఎకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు.

07/06/2019 - 23:36

నిజామాబాద్: విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు బడికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల నిండు ప్రాణాలను మొరం గుంత బలిగొంది. మొరంమట్టి కోసం 20 అడుగుల వరకు లోతుగా తవ్విన గుంతలో జారిపడిన విద్యార్థులు జల సమాధి అయ్యారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో శనివారం వెలుగులోకి వచ్చింది.

07/06/2019 - 22:47

పాట్నా, జూలై 6: పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శనివారం బెయిల్ లభించింది. బీజేపీ నాయకుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణకు శనివారంనాడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఇక్కడి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.

07/06/2019 - 22:42

న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పాత్రికేయుడు ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ ముగిసింది. జర్నలిస్టు ప్రియారమణి తనను అక్బర్ లైంగికంగా వేధించారంటూ ‘మీటూ’ వేదిగా తీవ్రమైన ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఆమె ఆరోపణకు తనకు పరువునష్టం కలిగించాయని ఎంజే అక్బర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అక్బర్ నుంచి శనివారం వాంగ్మూలం తీసుకున్నారు.

07/05/2019 - 23:49

మునగాల, జూలై 5: అనారోగ్యంతో మృతిచెందిన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు తీసుకెళ్తూ రోడ్డుప్రమాదంలో కుమార్తె దుర్మరణం పాలు కాగా మరో ఎనిమిది మంది కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడిన విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో 65వ నెంబరు జాతీయరహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగింది.

07/05/2019 - 23:47

వరంగల్, జూలై 5: వరంగల్ నగరంలో సంచలనం రేకిత్తించిన తొమ్మిది నెలల చిన్నారి అత్యాచారం, హత్య కేసు వేగవంతం అయ్యింది. అందుకు సంబంధించిన దర్యాప్తు పూర్తికావచ్చిందని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు.

07/05/2019 - 23:44

గుండాల, జూలై 5: లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నల్లగొండ జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి, సుద్దాల, అంబాల గ్రామ వీఆర్‌వో నల్ల శ్రీను, సుద్దాల వీఆర్‌ఏ తుంగ యాదగిరి శుక్రవారం రైతు నుండి 42 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

Pages