S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/22/2020 - 05:41

చల్లపల్లి, జనవరి 21: అగ్ని ప్రమాదంలో ఓ దివ్యాంగుడు సజీవ దహనమైన విషాద సంఘటన ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులతో పాటు చూపర్లను కలచి వేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దివ్యాంగుడు హసన్ బేగ్ (55) ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో తన ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

01/22/2020 - 05:40

కోడూరు, జనవరి 21: సంక్రాంతి నెల వచ్చిందంటే పంట చేతికి వచ్చిన సంతోషంలో రైతులతో కళకళలాడే పల్లెలు దుష్ట రాజకీయాలతో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలకు వేదికగా మారుతున్నాయి. మంగళవారం తెల్లారే సరికి నక్కవానిదారి గ్రామానికి చెందిన అప్పికట్ల వెంకటేశ్వరరావు(బుజ్జి)కి చెందిన ఎకరన్నర పొలంలోని రెండు వరికుప్పలు పూర్తిగా కాలిపోయి నల్లగా పొగలు కక్కుతూ కనిపించాయి.

01/22/2020 - 02:22

న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధుల అనర్హత అంశాన్ని నిర్ణయించే విషయంలో స్పీకర్ల వ్యవస్థ విఫలమైందని సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అనర్హత అంశంపై స్పీకర్లు మూడు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అనర్హత అంశాన్ని స్పీకర్ల నుండి తొలగించి మాజీ నాయయమూర్తులతో కూడిన ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌కు అప్పగించడం గురించి పరిశీలించాలని సుప్రీం కోర్టు పార్లమెంటుకు సూచించింది.

01/21/2020 - 05:32

మచిలీపట్నం: మూడు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఓ అవినీతి అధికారిణి సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కింది. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో భూ సంస్కరణల అధీకృత అధికారిణిగా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

01/21/2020 - 04:54

నిజామాబాద్: అక్రమార్జన కోసం ఇష్టారీతిన తవ్విన మొరం గుంతలు అభంశుభం తెలియని చిన్నారుల నిండు ప్రాణాలను కబళించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గత ఏడు మాసాల క్రితమే మొరం గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన ఇంకా మరువక ముందే, ఇదే తరహాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

01/21/2020 - 04:52

ఆదిలాబాద్, జనవరి 20: కుమ్రంభీం జిల్లా లింగాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లాపటార్ అటవీ ప్రాంతంలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది.

01/20/2020 - 06:03

కదిరి, జనవరి 19: అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండల పరిధిలోని చెర్లోపల్లి రిజర్వాయర్ వద్దకు ఆదివారం విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన హైదర్‌వలి కుటుంబం కదిరి రూరల్ మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్నారు.

01/20/2020 - 05:05

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్థరాత్రి నుంచి పలు చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వాహనదారులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 32 మందిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు.

01/20/2020 - 05:53

హైదరాబాద్: విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చింతకింది కాశీంను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఎదుట పోలీసులు ఆదివారం హాజరుపరిచారు. ఆదివారం సెలవు దినం కావడంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని తన నివాసంలోనే ప్రధాన న్యాయమూర్తి విచారించారు.

01/20/2020 - 01:49

ఉప్పల్, జనవరి 19: బోడుప్పల్‌లో ఎన్నికల ప్రచారం ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని 20వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ నుంచి జడిగె మహేందర్ యాదవ్ తరపున మామ అయిన తోటకూర శ్రీశైలం యాదవ్ ప్రచారం చేస్తున్నారు. ఇదే డివిజన్‌లో శ్రీశైలం అన్న కుమారుడు తోటకూర మల్లేష్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. ఒకే డివిజన్‌లో ఎన్నికల ప్రచారం జోరకుంది.

Pages