S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/23/2020 - 22:46

ఒంగోలు, జనవరి 22: ఒంగోలు శివారున మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఒంగోలు కేశవరాజుకుంట శివారులోని చిల్లచెట్ల పొదలో ఒక మహిళ అపస్మారక స్థితిలో వివస్తగ్రా పడి ఉంది. ఆమె పక్కనే దుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడి ఉన్నట్లు సమాచారం. మహిళ పై గ్యాంగ్‌రేప్ జరిగి ఉంటుందని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.

01/23/2020 - 05:44

సికిందరాబాద్, జనవరి 22: జల్సాలకు అలవాటు పడి..వాటిని తీర్చుకునేందుకు వరుసగా చోరీలకు పాల్పడిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం..నార్త్‌జోన్ పరిధిలోని చిలుకలగూడ, గోపాలపురం, లాలగూడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్‌నగర్‌కు చెందిన సతీష్ కుమార్ పనీపాటా లేకుండా తిరుగుతుండేవాడు.

01/23/2020 - 05:28

కడియం, జనవరి 22: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామంలో బుధవారం వేకువజామున ఒక ఉన్మాద చర్య చోటు చేసుకుంది. రాక్షసుడిగా మారిన ఒక వ్యక్తి తన మేనమామ కుటుంబంపై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. ఇంట్లో వారంతా ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఈ ఉన్మాద చర్యకు దిగడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు.

01/23/2020 - 05:23

పీలేరు, జనవరి 22: ఓ వైపు మహిళలపైన, బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష వేసే చట్టాలున్నా, కామంతో కన్ను, మిన్ను తెలియకుండా 57 సంవత్సరాల వయస్సున్న ఉపాధ్యాయుడు 11 సంవత్సరాల విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన దారుణ సంఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

01/23/2020 - 04:59

హైదరాబాద్, జనవరి 22: తప్పు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవల్సిందేనని, అయితే మరీ కఠిన చర్యలు భావ్యం కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ పేర్కొన్నారు. వరంగల్ ఎన్‌ఐటీలో మొదటి సంవత్సరం విద్యార్థి ఒకర్ని గంజాయి తాగుతున్నాడనే ఆరోపణలతో సస్పెండ్ చేయగా, న్యాయం కోరుతూ ఆ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించారు.

01/23/2020 - 01:08

న్యూఢిల్లీ, జనవరి 22: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిలిపి వేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ వాదన వినకుండా పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై తమ వాదన దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది.

01/23/2020 - 05:30

రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్‌లో పతల్‌గర్హి ఉద్యమం తీవ్రతరమయ్యింది. తమ ఉద్యమాన్ని వ్యితిరేకిస్తున్నారన్న కక్షతో పశ్చిమ సింఘూ్భం జిల్లాలోని ఏడుగురు రైతులను సాయుధులైన ఉద్యమకారులు అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఉద్యమకారుల చేతుల్లో లాఠీలు, గొడ్డళ్ళు ఉన్నట్లు స్థానికులు తెలిపారని పోలీసులు చెప్పారు.

01/22/2020 - 23:46

బెంగళూరు, జనవరి 22: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు అమర్చిన కేసులో అనుమానితుడిగా ఉన్న 36 ఏళ్ల వ్యక్తి బుధవారం నాడిక్కడ పోలీసుల ముందు లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు. బెంగళూరులోని పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయానికి వచ్చి లొంగిపోయిన అనుమానితుడిని విచారణ, వైద్య పరీక్షల నిమిత్తం నిర్బంధంలోకి తీసుకున్నట్టు వారు వివరించారు.

01/22/2020 - 23:07

కోర్బా, జనవరి 22: చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో 23 ఏళ్ల ఓ గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. బాల్కోనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఆ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, వారిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.

01/22/2020 - 05:53

సూర్యాపేట రూరల్, జనవరి 21: సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో గల మంజిత్ పత్తి మిల్లుపై మంగళవారం ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్ నుండి వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం ఉదయం నుండి మిల్లులో సోదాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వరకు కూడా దాడులు కొనసాగుతున్నాయి.

Pages