S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/28/2020 - 00:58

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ తరఫున ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించిందని పేర్కొంటూ సీబీఐ న్యాయస్థాన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

01/28/2020 - 01:31

కడప సిటీ: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి చనిపోయారు. ఈ దుర్ఘటన కడప నగర శివారులో సోమవారం జరిగింది. గౌస్, ఖాజీపీర్, వౌలా నీట మునిగి మృత్యువాతపడ్డారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర శివారు రామాంజనేయపురం సాగర్ కాలనీకి చెందిన గౌస్, ఖాజాపీర్, వౌలా కలిసి సమీపంలోని బుడ్డాయపల్లె చెరువులో ఈతకు వెళ్లారు. నీళ్లలోకి దిగిన వీరు ఈతరాక మునిగిపోయారు.

01/28/2020 - 00:01

న్యూఢిల్లీ, జనవరి 27: భోపాల్ గ్యాస్ బాధితులకు నష్టపరిహారానికి సంబంధించిన కేసు విచారణ మంగళవారం సుప్రీం కోర్టు చేపట్టనుంది. భోపాల్ గ్యాస్ విషాదంలో బాధితులకు అదనంగా 7,844 కోట్ల రూపాయలు చెల్లించేలా సంస్థను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

01/27/2020 - 23:55

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సైతం తిరస్కరించిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన ముకేష్ కుమార్ సింగ్.. అత్యవసర కేసుగా భావించి తక్షణమే విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌ల ధర్మాసనం దీనిపై స్పందించారు.

01/27/2020 - 01:59

కీసర, జనవరి 26: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం చత్తీస్‌ఘడ్‌కు చెందిన సురేశ్ మోదీ కన్‌స్ట్రక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ద్విచక్రవాహనంపై భార్య రజిని, కుమారులు రాధికాంత్, సాగర్, ఉదయ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కుషాయిగూడ వైపు వెళుతున్నాడు.

01/26/2020 - 06:29

నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, రైలు కింద పడి ఇద్దరు తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

01/26/2020 - 02:27

చల్లపల్లి, జనవరి 25: ఘంటసాల మండలం శ్రీకాకుళం జడ్పీ హైస్కూలులో పదవ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జడ్పీ హైస్కూలులో పదవ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన తమ్మనబోయిన దీపక్ సాయి (15) శనివారం పాఠశాల తెరవక ముందే పాఠశాల ఆవరణలో ఉరికి వేలాడుతూ కనిపించాడు.

01/26/2020 - 02:27

కైకలూరు, జనవరి 25: ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి బోల్తా కొట్టిన ఘటన మండల పరిధిలోని ఆలపాడు సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఏలూరు డిపోకు చెందిన ఏపీ 37 జడ్ 0032 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఏలూర నుండి నర్సాపురం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 42 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఆలపాడు సమీపంలో అదుపు తప్పటంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తా పడింది.

01/26/2020 - 02:23

చల్లపల్లి, జనవరి 25: మండల పరిధిలోని లక్ష్మీపురం సెంటరులో ఉన్న ఓ ప్రైవేట్ ఏటీయం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్ లిమిటెడ్‌కు చెందిన ఏటీయం మిషన్‌తో సహా చోరీ చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

01/24/2020 - 06:21

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండుగా విభజించటంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాలా? వద్దా? అనే అంశంపై తీర్పును ఐదుగురు న్యాయమర్తుల సుప్రీం కోర్టు బెంచ్ రిజర్వు చేసింది.

Pages