S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/23/2018 - 22:10

ఒంగోలు,ఏప్రిల్ 23 : జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రగతి భవన్‌లోని ఎస్‌సి కార్పొరేషన్‌లో రుణం మంజూరు చేసేందుకు నాలుగువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎఇవో జాన్సన్, సీనియర్ అసిస్టెంట్ బెనర్జీని ఎసిబి అధికారులు సోమవారం పట్టుకున్నారు. మేదరమెట్లకు చెందిన పార్థసారధి అనే లబ్థిదారుడికి గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు మంజూరయ్యాయి.

04/23/2018 - 04:10

హైదరాబాద్, ఏప్రిల్ 22: జాతీయ లీగల్ సర్వీసస్ అధారిటీ మార్గదర్శకాల మేరకు ఆదివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించినట్లు అథారిటీ మెంబర్ సెక్రటరీ బి ఆర్ మధుసూదనరావు తెలిపారు. ఇందులో 12,842 కేసులను పరిష్కరించగా వాటిలో 6988 ప్రీ లిటిగేషన్ కేసులు, 5854 కోర్టు పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రూ. 56.02 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లు చెప్పారు.

04/23/2018 - 03:58

తిరుపతి, ఏప్రిల్ 22: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో హుండీలో సమర్పించిన కానుకల ద్వారా సమకూరుతున్న నిధుల్లో వెయ్యి కోట్ల రూపాయలను వడ్డీ అధికంగా ఇస్తున్నారని ఇండస్ ఇండ్ బ్యాంకులో డిపాజిట్ చేయడాన్ని తప్పుపడుతూ తిరుపతికి చెందిన సామాజికవేత్త, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో శనివారం ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు.

04/23/2018 - 03:35

పెనుగంచిప్రోలు, ఏప్రిల్ 22: ఆటో ట్రాక్టర్‌ను ఢీకొన్న సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయిన ఘటన పెనుగంచిప్రోలు-ముండ్లపాడు రహదారి మధ్యలో ఆదివారం జరిగింది.

04/23/2018 - 03:27

సికిందరాబాద్, ఏప్రిల్ 22: సికిందరాబాద్ రేతిఫైల్ బస్‌స్టేషన్ ప్రాంతంలోని వైన్‌షాప్ ముందు ఆదివారం ఉదయం రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే ఆరుగురు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి కత్తులు, కర్రలు, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. తీవ్ర సంచనలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

04/23/2018 - 02:32

తిరుపతి, ఏప్రిల్ 22: తిరుమలలో తాళాలు వేసిన గదులను కూడా దొంగలు వదలడంలేదు. తాము బస చేసిన గదికి తాళాలు వేసి తిరుమలేశుని దర్శనానికి వెళ్లి వచ్చేలోగానే గదిలోని విలువైన వస్తువులు, నగదు చోరీకి గురైన సంఘటన ఆదివారం తిరుమలలో చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన భక్తులు తిరుమలకు చేరుకుని ఓ గదిలో బస చేశారు.

04/23/2018 - 00:35

చీరాల, ఏప్రిల్ 22: సినిమా చూపిస్తానంటూ ఓ మోసగాడు పసిపిల్లలకు పట్టపగలే అరచేతిలో వైకుంఠం చూపించాడు. చిన్నారులకు మాయమాటలు చెప్పి మండుటెండలో వదిలేసి ఎటో చెక్కేశాడు. దీంతో ఆదివారం సరదాగా గడుపుదామనుకున్న చిన్నారులకు ఎదురుచూపులే మిగిలాయి. బాధిత చిన్నారులు తెలిపిన వివరాల మేరకు కారంచేడుకు చెందిన పవన్ సినిమాలకు మైకులో ప్రచారం చేస్తూ ఉంటాడు.

04/23/2018 - 00:32

ఉదయగిరి, ఏప్రిల్ 22 : నియోజకవర్గ పరిధిలోని నర్రవాడ- దుత్తలూరు 565 జాతీయ రహదారిపై ఆగి ఉన్న మినీలారీని ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన కంచుపాటి దావీదు (50), గనే్నపల్లికి చెందిన బక్కా శామ్యూల్ (35), మరోవ్యక్తి కలసి దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామానికి దావీదు కుమారుడి పెళ్లిచూపులకు మోటార్‌బైక్‌లో బయలుదేరారు.

04/23/2018 - 00:23

సైదాపురం, ఏప్రిల్ 22: మండల కేంద్రమైన సైదాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన వన్ సిట్టింగ్ ఇంటర్ పరీక్షలలో ఓ విద్యార్థినికి బదులుగా మరో బాలిక పరీక్ష రాస్తుండగా తనిఖీ అధికారులు గుర్తించారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన మమత ఆదివారం సైదాపురంలో జరిగిన పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా ఆమె స్థానంలో ఆ బాలిక స్నేహితురాలు సాయితేజస్వీ అనే బాలిక పరీక్షకు హాజరైంది.

04/23/2018 - 00:23

సైదాపురం, ఏప్రిల్ 22: స్నేహతుని పుట్టిన రోజు కోసం ఆనందంగా స్నేహితునితోపాటు అతని ఊరు వెళ్లిన విద్యార్థి ఈత కోసం వెళ్లి దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని ఓరుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పొదలకూరుకు చెందిన రితేష్ (14) 8వ తరగతి చదువుతున్నాడు. ఓరుపల్లికి చెందిన మరో విద్యార్థి తన స్నేహితుడు కావడంతో అతని పుట్టిన రోజు జరుపుకొనేందుకు అతనితోపాటు ఓరుపల్లి గ్రామానికి వచ్చాడు.

Pages