S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/21/2018 - 02:48

హైదరాబాద్, ఏప్రిల్ 20: విజయవాడకు చెందిన బి-్ఫర్మసీ విద్యార్థిని ఆయేషా మీరాహత్య కేసును పునర్విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థ తీరు పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ఆయేషామీరా తల్లితండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

04/21/2018 - 03:00

న్యూఢిల్లీ: ఓ అత్యాచార ఘటనపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు ఓ న్యాయవాదిని ఉద్దేశించి ‘మీ బంధువులు ఎవరైనా అత్యాచారానికి గురయ్యారా?’ అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించింది.

04/21/2018 - 02:34

కట్టంగూర్, ఏప్రిల్ 20: హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామశివారులో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన ప్రమాదంలో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

04/21/2018 - 02:58

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మానగర్‌లో గల రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగినరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రామకృష్ణ కాలనీకి చెందిన రామిడి నరేష్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం కొత్త ఆటోను కొనుగోలు చేసి పూజ చేయించుకున్నాడు.

04/21/2018 - 02:03

హైదరాబాద్, ఏప్రిల్ 20: అమెరికా వీసాలు పొందేందుకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శాలిబండకు చెందిన మహ్మద్ ఫర్‌ఖాన్, యాకుత్‌పురాకు చెందిన షేక్ అబ్దుల్ బరిలను అరెస్టు చేసి వారి నుంచి నకిలీ ఆహ్వాన పత్రాలు, డెల్ కంపెనీ పేరుతో ఉన్న ఐడి కార్డులను, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

04/21/2018 - 03:58

తిరుపతి: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి జీవితాంతం తోడు, నీడగా ఉంటానని బాస చేసి వివాహమాడిన భార్యను, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డను హత్య చేసి ఆపై పోలీసులకు లొంగిపోయిన ఒక నేరస్థుడి ఉదంతమిది. ఆర్థిక సమస్యలతోనే తన భార్య, బిడ్డలను హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయిన నిందితుడు విచారణలో స్పష్టం చేసినట్లు సమాచారం.

04/21/2018 - 03:56

అహ్మదాబాద్: పదహారేళ్ల క్రితం నాటి నరోదా పటియా ఊచకోత కేసులో బీజేపీ మాజీ మంత్రి మాయా కొడ్నానీ, మరో 17మందిని గుజరాత్ హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా ప్రకటించింది. అయితే 97మంది మరణానికి సంబంధించిన 2002నాటి ఈ కేసులో బజరంగ్ దళ్ మాజీ నాయకుడు బాబూ బజరంగీ సహా 13మంది శిక్షలను ధృవీకరించింది. 2012లో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు దోషులుగా ప్రకటించిన 32మందిలో 18మంది నిర్దోషులుగా విడుదలయ్యారు.

04/21/2018 - 00:39

దేవరకొండ, ఏప్రిల్ 20: దేవరకొండ మండలం కొమ్మెపల్లి గ్రామానికి చెందిన పత్తి రైతు జెల్ల వెంకటయ్య (45) ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పత్తిని సాగు చేశాడు. సాగు కోసం ఆరులక్షల రూపాయలకు పైగా అప్పులు చేయడం వర్షాభావ పరిస్ధితుల కారణంగా సరైన దిగుబడి రాకపోవడంతో అప్పు తీర్చేమార్గం తెలియక వెంకటయ్య ఈ నెల 15 వ తేదీన క్రిమిసంహారక మందు సేవించాడు.

04/20/2018 - 23:46

ధర్మవరం, ఏప్రిల్ 20: మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి రైల్వే పట్టాలపై పడవేసిన సంఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గమనించిన తిప్పేపల్లి గ్రామస్థులు వీఆర్‌ఓకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్‌ఐ గోపాలుడుకు సమాచారం తెలిపారు. దీంతో ఎస్‌ఐ గోపాలుడు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.

04/20/2018 - 05:48

ములకలచెరువు, ఏప్రిల్ 19: రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరుజిల్లాలో 22మండలాల్లో 202ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని విలువైన రాగివైరును అమ్మే ముఠాను గురువారం ములకలచెరువు సీఐ రుషికేశవ అరెస్ట్ చేసిన రిమాండ్‌కు పంపిన సంఘటన జరిగింది. మదనపల్లె డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఇలా వున్నాయి.

Pages