S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2018 - 20:07

మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడ్‌త్యా దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాని, సంగీత హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్ర ఆడియో విడుదల ఆదిత్య మ్యూజిక్ ద్వారా హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, నిర్మాత మొహమ్మద్ జకీర్ ఉస్మాన్ చిత్ర సీడీలను విడుదల చేశారు.

11/19/2018 - 20:06

ఎం వరప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత జిఎమ్ మురళీధర్ నిర్మిస్తున్న చిత్రం సమయం లేదు మిత్రమా’. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్రాన్ని ప్రారంభించారు. పూర్తి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో నోయల్, ట్వింకిల్ సౌజ్ (తొలి పరిచయం) హీరో హీరోయిన్లు. నిర్మాత జిఎమ్ మురళీధర్ మాట్లాడుతూ ‘ఇది నా మొదటి చిత్రం. డైరెక్టర్ వరప్రసాద్ చెప్పిన కథ, కథనం నచ్చి సినిమా నిర్మాణానికి ముందుకొచ్చాం.

11/19/2018 - 20:05

శివ, సోనాపటేల్ హీరోహీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం రూల్ (ది పవర్ ఆఫ్ పీపుల్). 23న సినిమా విడుదలవుతోంది.

11/19/2018 - 20:03

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేనుశైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బ్లస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

11/19/2018 - 20:02

యు అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తనీష్, పరుచూరి రవి, ప్రియాసింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘రంగు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో రాజ్‌కందుకూరి మాట్లాడుతూ తనీష్‌ను అతని బాల్యం నుంచే చూస్తున్నామని, ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందన్నారు.

11/19/2018 - 20:01

‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో విజయ్ దేవరకొండ చేతులమీదుగా హుషారు చిత్రంలోని ఫ్రెడ్షిప్ సాంగ్ విడదలైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నిర్మాత వేణుగోపాల్, దర్శకుడు హర్ష పాటను రిలీజ్ చేయమని అడిగారు. అప్పటికే సిద్ శ్రీరాం పాడిన పాట విన్నాను. దీనికి ముందు సినిమాకు సంబంధించిన సంఘటన ఒకటి చెప్పాలి. వాస్తవానికి పెళ్లిచూపులకు ముందే హర్ష ఈ సినిమా స్క్రిప్టు పంపించారు.

11/19/2018 - 04:03

తమన్నా, సందీప్‌కిషన్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు కునాల్‌కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ -నెక్ట్స్ ఏంటి? నవదీప్, పూనమ్‌కౌర్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రం ట్రైలర్ విడుదలైంది. అమ్మాయి-అబ్బాయి మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలను ఇందులో ప్రస్తావించారు.

11/19/2018 - 04:01

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చాలామంది తెలుగు డైరెక్టర్లకు ఒక కల. ఆయన ఓ పదేళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉండడంతో చాలామంది ఈ జెనరేషన్ స్టార్ దర్శకులకు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దొరకలేదు. ఆ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈమధ్యనే మెగాస్టార్ త్రివిక్రమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మెగాస్టార్ ఇమేజ్‌కి కరెక్టుగా సూటయ్యేలా..

11/19/2018 - 03:59

హీరో సుధీర్‌బాబు, నాభ నటేష్ హీరో హీరోయిన్లుగా ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో వచ్చిన ‘నన్నుదోచుకుందువటే’ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు నూతన దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు. తొలి చిత్రం అయినప్పటికీ చాలా చక్కగా తెరకెక్కించాడని.. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా మలిచాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఈ దర్శకుడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.

11/19/2018 - 03:58

తమిళ స్టార్ హీరో సూర్య విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్‌జికె సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం విడుదల డేట్‌ను ఫిక్స్ చేశారు నిర్మాతలు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న సినిమాను విడుదల చేస్తారట. వారంపాటు షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టినట్టు నిర్మాతలు చెబుతున్నారు.

Pages