S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/21/2018 - 22:02

డిఎస్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో గజపతి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు కాదంబరి కిరణ్ క్లాప్ కొట్టారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గజపతి శ్రీనివాస్, సర్లాన రాంబాబు, సన్ మీడియా సీఈవో గంటాస్వామి, హీరోయిన్ షహరి పాల్గొన్నారు.

10/21/2018 - 22:00

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘సర్కార్’. దసరా సందర్భంగా విడుదలైన తమిళ వెర్షన్ టీజర్ సెనే్సషన్ క్రియేట్ చేస్తూ, రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ ఊపుచూస్తుంటే 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ మైలురాయిని అధిగమించేలా ఉంది.

10/21/2018 - 21:58

అనంత పద్మనాభస్వామి దేవాలయం నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశంతో శ్రీ అనంత పద్మనాభస్వామి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీసీఎం స్టూడియోస్, మైత్రీ అసోసియేషన్స్ పతాకాలపై నిర్మాతలు సిహెచ్‌విఎస్‌ఎన్ బాబ్జి, ఇ ధర్మప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లోని ఆర్‌పి పట్నాయక్ స్టూడియోలో ప్రారంభమైంది. వేదవ్యాస్ భట్టాచార్య రాసిన శ్లోకాన్ని జీబు సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు.

10/21/2018 - 21:57

ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న రోబో సీక్వెల్ 2.0 చిత్రం విడుదల సమయం దగ్గరపడింది. దాంతో చిత్రం ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచుతున్నారు. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ వీడియోను ఆదివారం ఉదయం విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్రం ట్రైలర్ విడుదల వేడుకను త్వరలోనే గ్రాండ్‌గా జరుపనున్నారు.

10/21/2018 - 21:55

తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఐదు లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసిన అసోసియేషన్ సభ్యులు చెక్‌ను అందించారు.

10/19/2018 - 22:13

సంచలన దర్శకుడు వర్మ తాజాగా మరో నిజమైన సంచలనానికి తెర తీసాడు. కొద్దిరోజుల క్రితం ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తాలూకు కీలక అప్‌డేట్‌ను ట్వీట్ చేసిన వర్మ, నిన్న చెప్పినట్టుగానే తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని లడ్డూతో ఫొటోలకు ఫోజులిచ్చేశాడు. నాస్తికవాదాన్ని సమర్థించే వర్మ ఇలా తిరుపతికి రావడం ఇదే తొలిసారి.

10/19/2018 - 22:17

మాస్ ఇమేజ్ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్. ఆయన నటించిన ‘అఖిల్’, ‘హలో’ చిత్రాలు లవ్ స్టోరీ చిత్రాలే కావడం ప్రస్తుతం నటిస్తున్న 3వ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కావడంతో యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట.

10/19/2018 - 21:57

వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో నిఖిల్ సక్సెస్ వెతుకులాట ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే అంగీకరించిన ఓ చిత్రం క్లైమాక్స్ షూటింగ్‌లో ఉండగానే కొత్త చిత్రాన్ని శుక్రవారం మొదలెట్టాడు. నివేదా థామస్‌తో జోడీ కట్టిన నిఖిల్ కొత్త చిత్రం ‘శ్వాస’. శ్రీ తేజ్ ఫిలిం ఫ్యాక్టరీ, రెడ్ స్కై ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై తేజు ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కిషన్ కట్టా దర్శకుడు.

10/19/2018 - 22:15

విజయదశమి సందర్భంగా దటీజ్ మహాలక్ష్మి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. తమన్నా పదహారణాల తెలుగమ్మాయి పాత్రలో కనిపించనున్న చిత్రమిది. ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్యంలో కథ సాగుతుంది. అమాయకంగావుండే అమ్మాయి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల ప్రభావం ఆమెను ఎలా శక్తివంతంగా మార్చాయన్న ఇతివృత్తమే దటీజ్ మహాలక్ష్మి.

10/19/2018 - 22:13

సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా దసరా సందర్భంగా హైదరాబాద్‌లో మొదలైంది. పండువలా సాగిన కార్యక్రమానికి సినీ పెద్దలు హాజరయ్యారు. టి సుబ్బిరామిరెడ్డి, అల్లు అరవింద్, అశ్వినీదత్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, సి కల్యాణ్, దర్శకులు కె రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

Pages