S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/15/2018 - 22:00

హీరో సాయిధరమ్ తేజ్ 11వ చిత్రం చిత్రలహరి (వర్కింగ్ టైటిల్). సోమవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి క్లాప్ కొట్టారు. ఈరోజు సాయిధరమ్ పుట్టినరోజు కావడం మరో విశేషం. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రంలో హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

10/15/2018 - 21:58

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రం 2 స్టేట్స్. చేతన్ భగత్ రాసిన నవలతో రూపొందుతున్న చిత్రంలో అడవి శేష్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లు. వెంకటరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎల్‌వి. సత్యనారాయణ నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ఫస్ట్‌లుక్‌ను విజయదశమికి విడుదల చేస్తున్నారు.

10/15/2018 - 21:56

యాక్షన్ హీరో గోపీచంద్ వరుసగా కొన్ని పరాజయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు కుమార్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రధానంగా లవ్ ఎంటర్‌టైనర్‌తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

10/14/2018 - 22:13

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. నోటాతో కోలీవుడ్‌లోకీ అడుగుపెట్టిన విజయ్, క్రాంతిమాధవ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరాకు ఈ సినిమా మొదలవుతుంది. దీంతోపాటే ప్రముఖ కన్నడ నిర్మాత చిత్రానికీ ఓకే చెప్పాడట. రజనీకాంత్, సల్మాన్‌ఖాన్ లాంటి సూపర్‌స్టార్లతో సినిమాలు తీసిన రాక్‌లైన్ వెంకటేష్ ప్రాజెక్టులో విజయ్ చేయబోతున్నాడన్నది తాజా టాక్.

10/14/2018 - 22:09

సొట్టబుగ్గల ఢిల్లీ బ్యూటీకి ఈమధ్య బాలీవుడ్ బాగానే అచ్చొచ్చింది. వరుస ప్రాజెక్టులు వర్కవుట్ కావడంతో మంచి హ్యాపీగా ఉందట తాప్సీ. మొదట కెరీర్ ఒకింత ఒడిదుడుకులైనా, తాజా ప్రాజెక్టులతో తాప్సీ నటిగా తనెంటే ప్రూవ్ చేసుకుంది కూడా. సౌత్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి దాదాపు ఐదారేళ్లు సరైన సక్సెస్ దొరకలేదు. అటు గ్లామర్‌పరంగా, ఇటు నటిగానూ చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

10/14/2018 - 22:07

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం ‘వినరా సోదర వీరకుమారా’. చిత్రం ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ బావుంది. దర్శకుడు సతీష్‌కి మొదటి సినిమా ఇది. కథ మొత్తం చెప్పాడు. మంచి మెసేజ్‌వున్న యూత్‌కి కావాల్సిన సినిమా అని పూరీ అన్నారు.

10/14/2018 - 22:05

హిట్టయిన చిత్రాలకు సీక్వెల్స్ చేసే పనిలో పడ్డాడు వెర్సటైల్ ఆర్టిస్ట్ కమల్‌హాసన్. ఒకవైపు వేగంగా రాజకీయాలవైపు అడుగులేస్తూనే, సినిమాలను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ‘విశ్వరూపం-2’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కమల్, త్వరలోనే భారతీయుడు-2 సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రమిది. దీని తర్వాత ప్రాజెక్టునూ కమల్ ప్రకటించేయడం విశేషం.

10/14/2018 - 22:02

స్మైల్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. వబ్బిన వెంకట్రావు నిర్మాత. మల్లె శ్రీనివాస్ సమర్పించిన చిత్రానికి రామస్వామి దర్శకుడు. అర్థనారి ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమాచౌదరి కీలక పాత్రధారులు. సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు రామస్వామి మాట్లాడుతూ ‘రచయితగా 40 సినిమాల అనుభవం.

10/14/2018 - 21:58

అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో సినిమాలు తెరకెక్కించేందుకు ఏకంగా ముగ్గురు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అందులో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాకు ప్లాన్ చేశాడట. దాంతోపాటు మరో నిర్మాత కూడా ఎన్టీఆర్‌పై సినిమా మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. అందులో తాజాగా ఎన్టీఆర్ పేరుతో బాలయ్య నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

10/14/2018 - 21:56

అనుకున్నట్టే అరవింద సమేత గటెక్కేసింది. భారీ వసూళ్లవైపు పరుగులు తీస్తుంది. ఓవర్సీస్‌లోనూ ఓకే అనిపించుకోవడంతో దర్శకుడు త్రివిక్రమ్ హ్యాపీ. పనె్నండేళ్ల తరువాత కుదిరిన కాంబోకి మంచి ఫలితమే దక్కిందన్న చర్చా ఇండస్ట్రీలో మొదలైంది. దీంతో త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్టు ఎవరితో ఉండొచ్చన్న అంచనాలూ రకరకాలుగా వినిపిస్తున్నాయి.

Pages