S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/11/2018 - 19:56

నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న యన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రంలో రానా ఏపీ సీఎం నారా చంద్రబాబు పాత్ర పోషిస్తుండటం తెలిసిందే. అయితే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్ర కోసం తమిళ హీరోయిన్ మంజిమా మోహన్‌ను చిత్ర బృందం ఇప్పటికే ఎంపిక చేసింది. తాజా సమాచారం ప్రకారం వచ్చేవారం అబిడ్స్‌లోని ఎన్టీఆర్ హౌస్‌లో జరగబోయే షెడ్యూల్‌లో మంజిమ పాల్గొనబోతోందట.

10/11/2018 - 19:54

ఈమధ్య విడుదల అయి సూపర్‌హిట్ అయిన యూత్‌ఫుల్ కామెడీ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ హిట్ చిత్రాల జాబితాలోకి మరొక సినిమా చేరనుంది. అదే మూడు పువ్వులు -ఆరు కాయలు.

10/11/2018 - 19:53

నటిగా క్వీన్ చిత్రంతో మెప్పించింది కంగన. మహిళగా ‘మీటూ’ స్ఫూర్తితో దర్శకుడు వికాశ్ భల్‌కు చెక్ చెప్పింది. చరిత్రలో స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన రాణీ ఝాన్సీ లక్ష్మిబాయ్ పాత్రతో ‘మణికర్ణిక’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కంగన.

10/10/2018 - 20:10

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బయోపిక్ ‘ఎన్టీఆర్’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీల ఫస్ట్‌లుక్‌లు విడుదలయ్యాయి. రకుల్‌ప్రీత్‌సింగ్ పుట్టినరోజు సందర్భంగా అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర పోషిస్తోన్న ఆమె ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అందగత్తె రకుల్ ఫస్ట్‌లుక్‌లో పోస్టర్‌లో అందంగా కనిపిస్తున్నా అతిలోక సుందరిని మ్యాచ్ చేయలేక పోవడం గమనార్హం.

10/10/2018 - 20:08

దశాబ్దానికి పైగా సౌత్‌లో టాప్ హీరోయిన్. వంద కోట్ల క్లబ్ నాయకి. ఆమె ఖాతాలో ఓ అరడజను రికార్డులు. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు పెట్టింది పేరు.. ఇవి చాలవా నయన్‌ను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడానికి. ఇటీవలే నయన్ నటించిన ‘కోకో కోకిల’ (కోలమావు కోకిల) చిత్రం తమిళ, తెలుగు ఆడియన్స్‌నే కాదు, విమర్శకుల నుంచీ ప్రశంసలందుకుంది. ఆస్కార్ (ప్రాంతీయ) నామినేషన్ల కేటగిరీలోనూ పోటీపడింది.

10/10/2018 - 20:07

సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జునే -హీరో. అతని ఫాలోవర్లు రెండు మిలియన్లకు చేరడంతో, అభిమానులు సంబరాలు చేస్తున్నారు. దీనిపై నిన్నటిదాకా వౌనం వహించిన బన్నీ, ఫ్యాన్స్‌నుంచి వత్తిడి పెరుగుతుండటంతో థాంక్స్ మెసేజ్ పోస్ట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలోనూ భారీ ఫాలోయింగ్‌వున్న బన్నీ అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. తాజా ట్రెండ్‌లో హీరో బేస్ తెలిసేది ఆన్‌లైన్‌లోనే.

10/10/2018 - 20:05

వినోదాత్మక చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో పదికాలాలు గుర్తుండిపోయే నటుడు -రాజేంద్రప్రసాద్. ఆయన తాజాగా బేవర్స్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చిత్ర విశేషాలపై మీడియాతో ముచ్చటిస్తూ, 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామన్నారు.

10/10/2018 - 20:03

వరుస పరాజయాలతో నిరాశపర్చిన యువ హీరో నితిన్ కొత్త సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఛలో లో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి భీష్మ’ టైటిల్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నితిన్‌తో రష్మిక జోడీకట్టనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది.

10/10/2018 - 19:58

చైతు, సమంత ఈసారి ఏం మాయ చేస్తారోనన్న ఆసక్తి టాలీవుడ్‌లో కనిపిస్తుంది. పెళ్లితో ఇద్దరి బంధం బలపడిన తరువాత స్క్రీన్ మీద మళ్లీ జోడీ కడుతుండటంతో కొత్త చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయ. టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్ సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ మొదలైంది.

10/10/2018 - 19:56

‘స్వాభిమానంతో మహిళ గొంతు విప్పడం ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా మించింది లేదు. ఈ ధైర్యాన్ని ముందుకు సాగించాలి. అందుకు సోషల్ మీడియా ఉంది’ అంటూ పిలుపినిచ్చింది బాలీవుడ్ అందగత్తె ఐశ్వర్యారాయ్. ఓ వెబ్‌పోస్ట్‌తో మాట్లాడుతూ ‘ఇది సరైన సమయమా? కాదా? అన్న సంకోచాలు పక్కనపెట్టి బాధితులు ధైర్యంగా ముందుకురావాలి’ అని కోరింది.

Pages