S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/19/2018 - 19:58

డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ రంగాల్లో అగ్రగామి ఏషియన్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకీ అడుగుపెడుతోంది. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే లవ్ స్టోరీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయ. నిర్మాతలుగా నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్‌రావు (ఎఫ్‌డిసి చైర్మన్) వ్యవహరించనున్నారు.

09/19/2018 - 19:56

‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’లాంటి క్లాసిక్స్‌తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లు. కాసం సమర్పణలో ఎస్‌ఎస్‌కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు పొన్నాల చందు, ఎం.ఎస్.మూర్తి, ఎమ్.అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దర్శకుడు రమేష్ చెప్పాల.

09/19/2018 - 19:55

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ బుధవారం విడుదలైంది. అప్పట్లో అక్కినేని లైలామజ్నుగా నటిస్తే, తండ్రి నాగార్జున మజ్నుగా సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇపుడు వారి వారసుకుడు అఖిల్ మిస్టర్ మజ్నుగా వస్తున్నాడు.

09/18/2018 - 20:22

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య భారీ పరాజయం పాలవడంతో నెక్స్ట్ సినిమా విషయంలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలువురు దర్శకులతో కథ చర్చలు జరిపినా కూడా ఎటూతేల్చుకోలేకపోతున్నాడట. నాపేరు సూర్య విడుదలై దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా కూడా పరిస్థితి మాత్రం ఓ కొలిక్కిరాలేదు. ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

09/18/2018 - 20:21

ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించింది కేవలం మూడు సినిమాల్లోనే.. కానీ ఆమె రేపిన దుమారం అంతాఇంతా కాదు. హాట్ హాట్ గ్లామర్ షోతోపాటు.. బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో అందర్నీ అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్? ఆమె భూమి ఫడ్నేకర్. ప్రస్తుతం సంకీర్జియా సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ప్రేమకు చోటులేదని..

09/18/2018 - 20:19

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘యూ టర్న్’- మిస్టరీ థ్రిల్లర్ జోన్‌గా వస్తున్న ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి సినిమా మంచి సక్సెస్ అయ్యింది. పవన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, భూమిక చావ్లా, హీరో రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

09/18/2018 - 20:18

జనరేషన్ గ్యాప్‌వున్నా యువన్ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. 80వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజా కొడుకు కావడం మరీ ఇష్టం. సంగీత దర్శకుడిగా బిజీగా ఉండికూడా నిర్మాతగా అడుగులేయడం అభినందించదగ్గ విషయం. కథపై ఎంత నమ్మకం ఉంటే తప్ప నిర్మాతగా చేయడు. ప్యార్ ప్రేమ కాదల్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

09/18/2018 - 20:15

మీ దేవదాస్‌ల గురించి?

-రెండు భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ప్రయాణం. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమా ద్వారా సందేశాలుగట్రా ఇవ్వాలన్న ఉద్దేశ్యం లేదు
.
ఇంతకీ కథేమిటి?

-శమంతకమణి సినిమా టైమ్‌లో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ కథను చెప్పారు. కథ ప్రకారం నాగార్జున, నానిలకు చెప్పడం వారికి నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది.

09/18/2018 - 20:13

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఇటీవల పొల్లాచిలో ప్రారంభమైంది. ‘రంగం’ఫేమ్ కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య ముఖ్యపాత్రధారులు. చిత్రంలో సూర్య కొత్త మేకోవర్‌తో ఉన్న ఫొటో ఒకటి నెట్లో వైరల్ అవుతుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న చిత్రంలో సూర్యకు జోడీగా సయేషా నటిస్తోంది.

09/18/2018 - 20:11

మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రవితేజ మూడు భిన్నమైన షేడ్స్‌లో కనిపించే ఈ సినిమాలో గ్లామర్ గర్ల్‌గా ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదల చేయడంతో అది జనాలకు బాగానచ్చేసింది. దాంతో దర్శక నిర్మాతలు ఇంకాస్త ఉత్సాహంతో సినిమాను పూర్తిచేసే పనుల్లో బిజీగామారారు.

Pages