S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/12/2018 - 21:04

ప్రస్తుతం హీరోలమధ్య చాలా పోటీ వుంది. ఆ పోటీ ఆరోగ్యకరంగానే ఉంది. ఆ పోటీలో తట్టుకుని నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నం చేయాలని అంటున్నాడు నాగచైతన్య. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగచైతన్యతో ఇంటర్వ్యూ...

ఎంటర్‌టైనింగ్‌గా..

09/12/2018 - 20:57

మహేష్‌కుమార్, మంజీర జంటగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రవికుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అలా జరిగింది’. ఈ చిత్రంలోని పాటలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత సాయి వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్‌ను, పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.అనసూయాదేవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

09/12/2018 - 20:55

ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పంది పిల్లను లీడ్ రోల్‌గా చేసుకొని సబ్జెక్ట్‌ను క్రియేట్ చేసిన క్రేజీ డైరెక్టర్ రవిబాబు తాజా చిత్రం ‘అదిగో’. రెండున్నర సంవత్సరాల క్రితం మొదలైన ఈ చిత్రం ట్రైలర్ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్ విడుదల అనంతరం రవిబాబు మాట్లాడుతూ.. పంది పిల్లతో సినిమానా...?

09/12/2018 - 20:53

సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తున్న చిత్రం ‘మసక్కలి’. అర్జున్‌రెడ్డి సినిమాను ఒక అమ్మ కోణంలో చూస్తే ఎలా వుంటుందో అలా వుండే చిత్రమిది. స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే అబ్బాయి కథ ఇది అంటున్నాడు నూతన దర్శకుడు నబి ఏనుగుబాల.

09/12/2018 - 20:50

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్‌ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్‌తో ఈ విషయం స్పష్టమైంది.

09/12/2018 - 20:48

శ్రీకాంత్ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్... అనేది ఉప శీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్, సునీల్ ‘కీ రోల్స్’చేస్తున్నారు. ఈనెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్ పూర్తికాగానే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

09/11/2018 - 20:23

ప్రస్తుతం సౌత్‌నే కాదు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం రోబో 2.0. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా వుంది. 2డి, 3డి ఫార్మెట్‌లలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను వినాయకచవితి సందర్భంగా ఈనెల 13న విడుదల చేస్తున్నారు.

09/11/2018 - 20:22

నయనతార ప్రస్తుతం కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా ఓ రేంజ్‌లో ఇమేజ్ సాధించుకున్న హీరోయిన్. ఆమెతో సినిమాలు చేసేందుకు ఇప్పటికీ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈమధ్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతున్న నయనతార, అటు కుర్ర హీరోలతోపాటు స్టార్ హీరోల సరసన నటిస్తోంది.

09/11/2018 - 20:20

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె యూ టర్న్ చిత్రంలో నటిస్తోంది. కన్నడంలో ఘనవిజయం సాధించిన చిత్రానికిది రీమేక్. పవన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా సమంతతో ఇంటర్వ్యూ..

09/11/2018 - 20:18

ఎనర్జిటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు రామ్‌కు ఈమధ్య సరైన విజయాలు అందడంలేదు. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా తరువాత తాజాగా రామ్ మల్టీస్టారర్‌లో నటించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి ఆయన తమిళ హీరోతో కలిసి ఈ మల్టీస్టారర్ చేస్తారట.

Pages