S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/24/2018 - 19:30

సుశాంత్ నటించిన ‘చి ల సౌ’ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ‘చి.ల.సౌ’ సినిమాకోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్‌తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన చి.ల.సౌ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.

07/24/2018 - 19:20

బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నిర్మించిన చిత్రం సాక్ష్యం. ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా పాత్రికేయులతో మచ్చటించారు. ఆయన మాటల్లోనే...

07/24/2018 - 19:19

అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిగేల్’. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారథ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. అరుణ్ ఆదిత్ సరసన ‘జంబలకిడి పంబ’ ఫేం సిద్ధి ఇద్నానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లి ఏలూరి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మల్లి ఏలూరి మాట్లాడుతూ- కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న జిగేల్ తొలి షెడ్యూల్ పూర్తయింది.

07/24/2018 - 19:17

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు రంగం సిద్ధం అవుతోంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించగా, సెనే్సషనల్ డైరెక్టర్ బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగులో కోనేరు కల్పన, డి.అభిరాం, అజయ్‌కుమార్ కలిసి కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా విడుదల చేస్తున్నారు.

07/24/2018 - 19:15

రెయిన్ చెక్ అంటే ఇచ్చిన ఆఫర్‌ను భవిష్యత్‌లో తీసుకుంటాను అని అర్థం. ఇప్పుడిదే టైటిల్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్‌స్టోరీని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండటం విశేషం.

07/24/2018 - 19:14

వీర భోగ వసంతరాయలు చిత్రంలోని శ్రీయ లుక్‌ని ఇటీవల హీరో నారా రోహిత్ విడుదలచేశారు. సినిమా మేకర్స్ ఈ శ్రీయ లుక్‌ని కల్ట్‌లుక్‌గా అభివర్ణిస్తూ న్యూహెయిర్‌స్టైల్‌లో ఉన్న శ్రీయ లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్‌లో శ్రీయ సరికొత్తగా కనిపిస్తుండగా కళ్ళల్లో తెలీని ఇంటెన్సిటీ కనిపిస్తుంది.. శ్రీయ లుక్ చూస్తుంటే ఇంతవరకు శ్రీయ చేయని పాత్రలా అనిపిస్తుంది.

07/23/2018 - 19:31

అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా ఇటీవలే ఫిలిం సిటీలో మొదలైన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రను పోషిస్త్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బసవరామ తారకంగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తోంది. పలువురు తెలుగు స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది.

07/23/2018 - 19:30

ఈమధ్య సినిమాలకు పర్యాయంగా వెబ్ సిరీస్‌లు రెడీ అవుతున్నాయి. వీటికి సినిమాల్లా కమర్షియల్ తలనొప్పులు ఉండవు.. తమ కానె్సప్ట్ మంచిదైతే చాలు జనాలు ఈజీగా చేసేస్తారు.. పైగా ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల మేనియా ఇండియాలో బాగా పెరిగింది. ఇప్పటికే కొన్ని వెబ్ సీరిస్‌లో దుమారం రేపుతున్నాయి. స్కేర్డ్ గేమ్స్ పేరుతో తెరకెక్కిన తాజా వెబ్‌సిరీస్ మాత్రం ఓ రేంజ్‌లో సంచలనం రేపుతోంది.

07/23/2018 - 19:28

నితిన్, రాశీఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుక పెళ్లి వేడుకను తలపించేలా నటీనటులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

07/23/2018 - 19:26

ఈ ఏడాది ‘రంగస్థలం’, మహానటి, అభిమన్యుడుతో వరుస విజయాలను సొంతం చేసుకొని టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని. ఇక ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘యు టర్న్’ అనే చిత్రంలో నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Pages